తన పాప్ సాంగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా యువతను అలరిస్తున్న అమెరికన్ పాప్ సింగర్ లేడీ గాగా. ఎప్పుడు పాశ్చాత్య గీతాలతో శ్రోతలను మంత్రముగ్దులను చేసే ఈమె... ఓ సంస్కృత వ్యాక్యాన్ని ఆదివారం ట్వీట్ చేసింది. "లోకా సమస్త సుఖినో భవంతు" అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది. ఇప్పుడిది వైరల్ అవుతోంది.
దీనిపై స్పందించిన భారతీయులు కొందరు జైశ్రీరామ్ అంటూ రీట్వీట్స్ చేశారు. నీకు త్వరగా పెళ్లి కావాలని మరికొందరు వ్యాఖ్యానించారు.
ఇది చదవండి: పాడుతూ స్టేజిపై నుంచి కిందపడ్డ పాప్ సింగర్ లేడీ గగా