ETV Bharat / sitara

సినీ ఆర్టిస్టులకు అండగా కేజీఎఫ్​ హీరో

కరోనాతో ఇబ్బందులు పడుతున్న సినీ ఆర్టిస్టులు, టెక్నిషియన్లు వంటి 3000మందికి సాయమందించేందుకు ముందుకొచ్చారు కేజీఎఫ్​ ఫేమ్​ యష్​. ఒక్కొక్కరికీ రూ.5 వేలను అందించనున్నట్లు తన ట్విట్టర్​ ద్వారా ప్రకటించారు

yash, kgf hero
యష్, కెజీఎఫ్ హీరో
author img

By

Published : Jun 1, 2021, 10:09 PM IST

కేజీఎఫ్​ హీరో యష్ పెద్ద మనసు చాటుకున్నారు. కొవిడ్ కష్ట కాలంలో కన్నడ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ సినీ ఆర్టిస్టులు, టెక్నిషియన్లు​, తదితర 3000 మందికి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ రూ.5000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు తన ట్విట్టర్​ ద్వారా ప్రకటించారు.

"నేను సంపాదించిన దాంట్లో కొంత సాయం చేయాలనుకుంటున్నాను. మా యూనియన్​ అధ్యక్షుడు శ్రీ సా రా గోవిందు, ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్​తో ఈ విషయం గురించి చర్చించాను. ఆర్టిస్టులు, టెక్నిషియన్లు, కార్మికుల బ్యాంకు వివరాలు మాకు చేరిన వెంటనే ఆ మొత్తాన్ని వారికి అందిస్తాము"

-యష్​, కన్నడ హీరో.

కెజీఎఫ్-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు యష్​. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 16న విడుదల కానుంది.

ఇదీ చదవండి: చిన్నారి చేసిన పని చిరంజీవిని కదిలించింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.