ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ - లిజిల కూతురైన కల్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు ప్రేమలో పడిపోయిందట. తెలుగులో అఖిల్‌తో కలిసి 'హలో' చిత్రంలో నటించిందీ హీరోయిన్. ఇదే కల్యాణికి మొదటి సినిమా. ప్రస్తుతం తన మాతృభాష అయిన మలయాళంలో అనూప్ కృష్ణన్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ సరసన కలిసి నటిస్తోంది.
తాజాగా కల్యాణికి చెందిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ హీరోయిన్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ ప్రేమలో పడిందని సినీ వర్గాల సమాచారం. ప్రణవ్ - కల్యాణిలకు చాలాకాలం నుంచే పరిచయం ఉందట. అందులోనూ నటుడు మోహన్‌లాల్ దర్శకుడు ప్రియదర్శన్‌ల కుటుంబాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి.
గతంలో తన ప్రేమ వ్యవహారంపై కల్యాణి స్పందిస్తూ.."అవును నేను ప్రేమలో ఉన్నాను. అందులో తప్పేంలేదు కదా. నేను ప్రేమించినవాడితోనే నా జీవితం ఉంటుంది. అతన్నే పెళ్లి చేసుకుంటాను. మా కుటుంబానికీ తెలుసు. అయినా నా ప్రియుడి పేరు మాత్రం ఇప్పుడే చెప్పలేను. ప్రేమిస్తే తప్పులేదు. నిజమైన ప్రేమకు ఎలాంటి సమస్యలు ఉండవు" అని చెప్పుకొచ్చింది.
ఇవీ చూడండి.. అలాంటి వారి కోసమే పాటలు రాస్తున్నా: చంద్రబోస్