బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావ్.. జాన్వీ కపూర్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. తనకు పనిపట్ల నిబద్దత, కష్టపడే స్వభావం కలిగి ఉందని చెప్పాడు. వీరిద్దరూ హారర్ చిత్రం 'రూహ్ అఫ్జా'లో తొలిసారి జంటగా నటిస్తున్నారు.
"జాన్వీ అసాధారణ వ్యక్తి. పని పట్ల నిబద్దత, అంకిత భావం కలిగిన నటి. 'ధడక్'లో జాన్వీ పాత్ర ఆమె ప్రతిభలో ఓ భాగం మాత్రమే. ముందు ముందు తన నటనతో మరింత ఆకట్టుకుంటుంది." -రాజ్‌కుమార్ రావ్, బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్
వీరిద్దరూ కలిసి నటిస్తున్న 'రూహ్ అఫ్జా' ప్రస్తుతం ఆగ్రాలో షూటింగ్ జరుపుకుంటోంది. హార్దిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. దినేశ్ విజిన్, మృగ్దీప్ సింగ్ లంబా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: రెండు పాత్రల్లో భయపెట్టే దెయ్యం..'రూహ్-అప్జా'