జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్'. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల మనసు దోచింది. 2009లో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. అయితే, ఇటీవలే మళ్లీ రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ. 397.83 కోట్లను(54.2 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. అంతేకాదండోయ్ కలెక్షన్‌ల విషయంలో 'అవతార్'ను అధిగమించి దూసుకెళ్లి 'అవెంజర్స్: ది ఎండ్ గేమ్'ను వెనక్కి నెట్టింది. దీంతో ఇప్పటివరకూ ఈ సినిమా రూ. 2.08 లక్షల కోట్ల(2.841 బిలియన్ డాలర్లు) పైచీలకు కలెక్షన్లు సాధించి ప్రపంచంలోనే అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.
'అవతార్'కు కొనసాగింపుగా మరో నాలుగు సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఇందులో భాగంగా 'అవతార్ 2'ను 2021లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో చిత్రీకరణ ఆలస్యం అయింది. కొంతకాలం కిందట చిత్రీకరణను తిరిగి న్యూజిలాండ్‌లో మొదలుపెట్టి పూర్తి చేశారు. 2022 డిసెంబరులో 'అవతార్ 2' విడుదల కానుంది. 'అవతార్ 3' చిత్రీకరణ కూడా చాలా వరకూ పూర్తి చేశారు కామెరూన్. దీన్ని 2024 డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇవి విజయవంతమైతే 'అవతార్ 4', 'అవతార్ 5' చిత్రాలను పూర్తి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇప్పుడు రానున్న రెండో భాగం సముద్ర గర్భం నేపథ్యంలో ఉండనుంది. ఇందుకోసమే నీటి అడుగు భాగంలో కూడా కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇందుకోసం నటి కేట్ విన్‌స్లెట్ పెద్ద సాహసం చేసింది. ఒక సీన్ చిత్రీకరణ కోసం ఆమె నీటి అడుగున దాదాపు 7నిమిషాల పాటు ఊపిరి బిగపట్టి ఉందట. ఇంతకీ ఈ సీక్వెల్స్ బడ్జెట్ ఎంతో తెలుసా? ఒక బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ. శామ్ వర్దింగ్టన్, జోయ్ సల్డానా, కేట్ విన్స్‌లెట్, రిబ్సి, జోయల్ డేవిడ్ మూరీ, దిలీప్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇదీ చూడండి: టాలీవుడ్లో 'వకీల్‌సాబ్' ట్రైలర్‌దే ఆ రికార్డు!