నాని 'వి' సినిమా విషయమై మోడల్ సాక్షి మాలిక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అనుమతి లేకుండా తన ఫొటోను ఉపయోగించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ చిత్రం గతేడాది సెప్టెంబరులో అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలైంది.
అసలేం జరిగింది?
ఈ సినిమాలో మొబైల్ ఫోన్లో సెక్స్ వర్కర్ ఫొటోను వేరే వ్యక్తికి చూపించే సన్నివేశం ఒకటి ఉంది. అందులో తన ఫొటోను ఉపయోగించారని చెప్పిన సాక్షి మాలిక్, 'వి' చిత్రంపై పరువు నష్టం దావా వేసింది. స్పందించిన న్యాయస్థానం, సదరు సీన్ తొలగించాలని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ఆదేశించింది.
వ్యక్తుల అనుమతి లేకుండా వారి ఫొటోలను వినియోగించడం చట్ట విరుద్ధమని, అలా చేస్తే పరువు నష్టం కిందకే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. తక్షణమే ఆమె ఉన్న సన్నివేశాలు తొలగించాలని స్పష్టం చేసింది. దానిని డిలీట్ చేసిన తర్వాత సాక్షికి చూపించి, సినిమాను ఓటీటీలో అప్లోడ్ చేయాలని చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: