బాలీవుడ్లో ప్రేమ జంటగా నిత్యం వార్తల్లో ఉంటారు అర్జున్ కపూర్, నటి మలైకా అరోరా. వీరిద్దరి బంధం పెళ్లి వరకు వెళ్లిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ యువహీరో ఓ అమ్మాయితో బ్లైండ్ డేటింగ్లో పాల్గొన్నాడు. ఆషీ అనే ముద్దుగుమ్మతో ప్రేమ కబుర్లు చెప్తూ పిజ్జాలు తింటూ కనిపించాడు. ఇదంతా విన్నాక అర్జున్-మలైకా విడిపోయారా అనే సందేహం రావచ్చు.

"నా జీవితంలో ఇదే మొదటి డేట్. నటుడిగా మారిన తర్వాత జరిగిన బ్లైండ్ డేట్ ఎంతో సంతోషంగా సాగింది. ప్రారంభంలో కొద్దిగ సిగ్గుగా అనిపించినా.. ఆషీ తన మాటలతో మాయ చేసింది. ఆమెలో ఉన్న భావాలు నన్ను కట్టిపడేశాయి."
- అర్జున్ కపూర్, బాలీవుడ్ నటుడు.
ఆ సమయంలో పిజ్జా తింటూ..ఇద్దరూ ఒకరి గురించి ఒకరు అడిగి తెలుసుకున్నారు. ఆషీకి ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టమని ఆరా తీశాడు అర్జున్. మరి ఇందులో సల్మాన్‌ఖాన్, రాణా, ప్రభాస్ వంటి నటీనటులు హాజరయ్యే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి...బాలయ్య సరికొత్త అవతారం.. నెట్టింట వైరల్