మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ రెండేళ్ల తర్వాత టాలీవుడ్లో మళ్లీ జోరు పెంచింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్'లో నటిస్తోంది. ఇదిలా ఉండగానే మరో స్టార్ హీరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాలో నటించనుంది. రమేష్ వర్మ దీన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కూడా కనిపించనుంది.
అక్టోబర్ 18 నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. దాదాపు 70రోజుల పాటు హైదారాబాద్‌లో షుటింగ్ జరపనున్నారు. కోనేరు సత్యనారాయణ దీన్ని నిర్మించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్ చివరిసారిగా 2018లో నాగచైతన్య హీరోగా నటించిన 'శైలజరెడ్డి అల్లుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇదీ చూడండి హీరోయిన్ తమన్నాకు కరోనా