Actress Suicide: భోజ్పురి నటిని వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన ఇద్దరు నిందితులను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో తన నివాసంలో ఉరివేసుకొని ఉన్న నటిని గుర్తించిన అనంతరం ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ఏం జరిగిందంటే..
డిసెంబర్ 20న ఓ పార్టీలో ఉన్న 28 ఏళ్ల నటిని ఎన్సీబీ అధికారులమంటూ బెదిరించారు ఇద్దరు నిందితులు. విడిచి పెట్టాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమెతో పాటు ఉన్న అజీమ్ క్వాజీ అనే వ్యక్తి సహా మరో యువకుడిని కూడా డబ్బుల కోసం వేధించసాగారు.
పదేపదే బ్లాక్మెయిల్ చేయడాన్ని తట్టుకోలేకపోయిన నటి డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 23న రాత్రి సూసైడ్ చేసుకుంది. దీంతో ఇద్దరు ప్రధాన నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి: Manikka Vinayagam: 'శంకర్ దాదా' సింగర్ కన్నుమూత