తన అందచందాలతో.. స్పైసీ డ్యాన్సులతో నిన్నటితరం కుర్రకారు మతులు పోగొట్టిన అందాల తార షకీలా (Shakeela). మన్మథుడిని కూడా ఆమె సోగ కళ్లతో కట్టిపడేయగల వయ్యారి భామ. అందంతో పాటు మంచి మనసున్న వ్యక్తి కూడా. తాజాగా కరోనా కష్టకాలంలో పేదలకు సాయం చేస్తూ మరోసారి మంచి మనసు చాటుకున్నారు షకీలా. ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశారు.

"మీకు రెండు చేతులు ఉన్నాయి. ఒకటి నీకు నువ్వు సాయం చేసుకోవడానికి, మరొకటి ఇతరులకు సాయం చేసేందుకు. అందువల్ల అవసరం ఉన్న వారికి తోడుగా నిలవండి" అంటూ చెప్పుకొచ్చారు షకీలా.
