టీవీ యాంకర్ సుమ ఆడపడుచు, రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి, ఈరోజు(సోమవారం) అనారోగ్యంతో మృతి చెందారు. గతంలో వీరిద్దరూ అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు. కొంతకాలం నుంచి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నటనకు దూరంగా ఉన్నారు. ఈమె మృతిపై పలువురు టాలీవుడ్ నటులు.. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి. ఈమె భర్త సీనియర్ జర్నలిస్టు, రంగస్థల కళాకారుడు పెద్ది రామారావు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
శ్రీలక్ష్మి మృతిపై స్పందించిన టీవీ నటుడు హర్షవర్ధన్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వార్త వినడం దురదృష్టకరమన్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్న ఈ సమయంలో ఎవరూ వారి ఇంటికి వెళ్లకపోవడమే మంచిదని చెప్పారు. వారి కుటుంబసభ్యులు దగ్గరుండి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.