ETV Bharat / sitara

'పుట్టుకతోనే వృద్ధుడివా అంటూ అతడిని ఆటపట్టించా' - నటుడు రాజేంద్రప్రసాద్

నటుడు రాజేంద్రప్రసాద్.. 'తోలుబొమ్మలాట' విడుదల సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తనలాంటి సీనియర్లు సినిమాలో ఉన్నారంటే అంచనాలు ఉంటాయని అన్నాడు. ఈ చిత్ర కథ చెప్పినపుడు దర్శకుడిని ఆటపట్టించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.

నటుడు రాజేంద్రప్రసాద్
author img

By

Published : Nov 18, 2019, 7:42 PM IST

Updated : Nov 18, 2019, 10:31 PM IST

"హీరో కామెడీ చేయ‌డం వేరు, హాస్య నటుడు కామెడీ చేయ‌డం వేరు. ఏదేమైనా గుర్తుండిపోయే కామెడీనే అత్యుత్త‌మమైన‌ది. హీరోగా అలా గుర్తుండిపోయే పాత్ర‌లు ఎన్నెన్నో చేశాన‌ు. క్యారెక్ట‌ర్ న‌టుడ‌య్యాక కూడా హాస్యం పండించడం త‌ప్ప‌లేదు. అయితే ఈ ద‌శ‌ను మ‌రింత‌గా ఆస్వాదిస్తున్నా" నని అంటున్నాడు నటుడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌.

ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'తోలుబొమ్మలాట'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో విలేకరులతో ముచ్చటించాడు. చిత్ర విశేషాలను పంచుకున్నాడు.

  • సోడాల రాజు కథే 'తోలుబొమ్మలాట'

"తోలుబొమ్మ‌లాట అంటే మ‌నుషులు ఆడే ఆట అని అర్థం. మ‌నం తోలు ఉన్న బొమ్మ‌లాంటి వాళ్లం.. మ‌నల్ని అక్క‌డెవ‌రో ఆడిస్తున్నారు కాబట్టి ఇదంతా 'తోలుబొమ్మ‌లాట' అయింది. ఎవ‌రెలా ఆడిస్తున్నా... జీవితాన్ని మ‌నం అనుకున్న‌ట్టుగా గ‌డ‌పాలి. అనుకోకుండా కొన్ని సమస్యలు వ‌చ్చి ప‌డుతుంటాయి. అలాంటివాటిని ఎదుర్కొంటూ జీవితాన్ని గ‌డ‌పాలి. ఆ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మే ఇది. ఇందులో సోడాల రాజుగా క‌నిపిస్తా. ఊళ్లో ఒక గౌర‌వం ఉన్న వ్య‌క్తి సోడాల రాజు. ఆయ‌న కుటుంబంలో ఏం జ‌రిగింది? చుట్టూ ఉన్న ప‌రిస్థితులు ఎలా మారాయి? ఆ స‌మ‌యంలో ఏం చేశాడ‌న్న‌ది తెర‌పైనే చూడాలి" -రాజేంద్ర ప్రసాద్, నటుడు

ACTOR RAJENDRA PRASAD
నటుడు రాజేంద్రప్రసాద్
  • పుట్టుకతో వృద్ధుడివా అంటూ ఆట పట్టించా

"ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ మాగంటి చాలా చిన్న కుర్రాడు. త‌ను వ‌చ్చి మీ స్టైల్ క‌థ ఉంద‌ని చెప్పాడు. నా స్టైల్ క‌థ, అది కుర్రాడు చెప్తానంటున్నాడంటే అల్ల‌రి ప‌నులు చేసే 'లేడీస్ టైల‌ర్‌' త‌ర‌హా పాత్ర చెబుతాడేమో అనుకున్నా. కానీ 'తోలుబొమ్మ‌లాట' క‌థ చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. పుట్టుక‌తోనే నువ్వు వృద్ధుడివా, ఇలాంటి క‌థ చెప్పావ‌ని స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించా. అంత ప‌రిణ‌తితో కూడిన క‌థ ఇది." -రాజేంద్ర ప్రసాద్, నటుడు

ACTOR RAJENDRA PRASAD
నటుడు రాజేంద్రప్రసాద్
  • ప్రతి పాత్రను సవాలుగానే తీసుకుంటా

"అనుభ‌వం ఉంది కాబ‌ట్టి ఎలాంటి పాత్ర‌యినా అల‌వోక‌గా చేస్తాన‌ని రిలాక్స్ అయ్యే వ్య‌క్తిత్వం కాదు నాది. నేనొక క‌థ విన్నానంటే ఆ త‌ర్వాత రెండు గంట‌ల వ‌ర‌కు నా కుటుంబ స‌భ్యులెవ‌రూ నా ద‌గ్గ‌రికి రారు. విన్న ఆ పాత్ర గురించే ఆలోచిస్తుంటాన‌ని. అలా ప్ర‌తి పాత్రను ఓ స‌వాల్‌గానే తీసుకుంటాను. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన‌వాణ్ని. అక్క‌డ పాత్ర‌కు త‌గ్గ వ‌య‌సుతో క‌నిపించ‌డం, ఆ పాత్ర‌ను ఎలా ఉన్న‌తంగా మార్చ‌వ‌చ్చో నేర్పించారు" -రాజేంద్ర ప్రసాద్, నటుడు

ACTOR RAJENDRA PRASAD
నటుడు రాజేంద్రప్రసాద్
  • నాలాంటి సీనియర్లుపై అంచనాలు ఎక్కువే

"స‌చిన్ తెందూల్కర్​ క్రీజులోకి అడుగుపెడుతున్నాడంటే అత‌డిపై ఎన్నో అంచ‌నాలుంటాయి. మాలాంటి సీనియ‌ర్లు సినిమాలో ఉన్నారన్నా అంతే. ఏదో చేస్తాడ‌ని ఆశిస్తారు. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించాల్సిందే. సెట్‌లో న‌వ‌త‌రం ఎలాంటి స‌ల‌హాలు అడిగినా ఇస్తుంటా. వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ప్పుడే కొన్ని అనుభ‌వాల్ని పంచుకుంటుంటా. ప్ర‌స్తుతం 'స‌రిలేరు నీకెవ్వ‌రు', 'అల వైకుంఠ‌పురంలో', 'ఎర్ర చీర' త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తున్నా" -రాజేంద్ర ప్రసాద్, నటుడు

ACTOR RAJENDRA PRASAD
నటుడు రాజేంద్రప్రసాద్
  • "మా" కోసం పిలిస్తే కచ్చితంగా వస్తా

"మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా)లో ప‌రిణామాల గురించి చాలా మంది నా ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తుంటారు. 'మా' అంటే ఎంతో గౌర‌వంగా ఉండాలి. మీరు వ‌చ్చి కూర్చుని స‌రిదిద్దండి అని కొద్దిమంది చెప్పారు. పిలిస్తే క‌చ్చితంగా నేను చేయాల్సింది చేస్తా" -రాజేంద్ర ప్రసాద్, నటుడు

ఇది చదవండి: బంధాలు, అనుబంధాల ఆటే... 'తోలుబొమ్మలాట'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Hong Kong – 18 November 2019
1. Various of fire raging
2. Various of protesters sitting on the ground, resting in full protest gear
3. Various of group of protesters making petrol bombs
STORYLINE:
Fires were still raging at a Hong Kong university on Monday after riot police stormed the campus overnight and dragged away some of the protesters who were barricaded inside.
As dawn broke, other protesters remained at the campus, resting or preparing petrol bombs for the next confrontation.
Anti-government protesters have been holed up inside Hong Kong Polytechnic University for days, despite repeated efforts by police to disperse them.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 18, 2019, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.