బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి ఘటన మరిచిపోకముందే ముంబయిలో మరో నటుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. భోజ్‌పురి నటుడు అక్షత్ ఉత్కర్ష్.. ముంబయి, అంధేరిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమా అవకాశాలు సరిగ్గా లభించక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నటుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు స్పష్టం చేశాడు. ఈ నటుడు ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడని వెల్లడించారు. అయితే కుటుంబసభ్యులు మాత్రం ఇది హత్య అని ఆరోపిస్తున్నారు.
బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన నటుడు అక్షత్.. పలు భోజ్‌పురి సినిమాల్లో నటించాడు. హిందీ చిత్రసీమలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు కొంతకాలం క్రితం ముంబయికి మకాం మార్చాడు.
ఇదీ చూడండి 'డ్రగ్స్ కాదు..ధూమపానం అలవాటు కూడా లేదు'