ETV Bharat / sitara

ఆ దేశాల్లో నిషేధించిన చిత్రాలే ఇక్కడ సూపర్ హిట్లు

author img

By

Published : Mar 20, 2020, 6:05 AM IST

Updated : Mar 20, 2020, 10:42 AM IST

ఎన్ని సినిమాలు వచ్చినా.. ఏ భాషలో విడుదలైనా అభిమానులు ఆదరిస్తూనే ఉంటారు. అలాంటిది మంచి కథాంశంతో రూపొందిన చిత్రాలైతే ఇక సూపర్​ హిట్లే. మరి అలాంటి సినిమాలు మన దేశంలో మంచి విజయం సాధించి.. విదేశాల్లో కనీసం విడుదలకే నోచుకోలేదంటే ఆశ్చర్యమే కదా.. మరి ఆ సినిమాలేవో తెలుసుకుందామా!

15 Bollywood Movies That Were Banned In Other Countries But Are Hit In India
ఆ దేశాల్లో నిషేధించిన చిత్రాలే ఇక్కడ సూపర్ హిట్లు

సాధారణంగా బాలీవుడ్​ సినిమాలను కొన్ని దేశాల్లో తరచూ బ్యాన్​ చేస్తూనే ఉంటారు. ఇందులో కొత్తేమీ లేదు. కానీ భారత్​లో సూపర్​ హిట్​ అయిన చాలా సినిమాలను విదేశాల్లో నిషేధించారు. వీటికి కారణం కొన్ని చిత్రాల్లో అశ్లీల సన్నివేశాలు ఉండటం ఓ కారణమైతే మరికొన్ని చిత్రాలు స్క్రీనింగ్​ను దాటలేకపోయాయి. మరి మన దేశంలో మంచి విజయాన్ని అందుకుని విదేశీ ప్రేక్షకులకు చేరలేకపోయిన ఆ చిత్రాలేమిటో చూద్దామా!

ప్యాడ్​మాన్​

రుతుస్రావం సమయంలో వాడే సానిటరీ న్యాప్​కిన్లపై మహిళలకు అవగాహన పెంచి.. వాటిని అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చిన తమిళనాడుకు చెందిన అరుణాచలమ్ మురగనాథమ్​ బయోపిక్​గా 'ప్యాడ్​మాన్​' చిత్రం రూపొందింది. ఇందులో అక్షయ్​కుమార్​, సోనమ్​కపూర్​, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు. ఆర్​ బల్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారత్​లో మంచి హిట్​ టాక్​ అందుకుంది. అయితే ఈ సినిమాను విడుదల చేయడానికి పాకిస్థాన్ నిరాకరించింది. మహిళలు వాడే న్యాప్​కిన్లపై సినిమా తీయడం వారి సంస్కృతి, సాంప్రదాయాలకు విరుద్ధమని తెలిపిన పాకిస్థాన్​ ఫెడరల్​ సెన్సార్​ బోర్డు ఈ సినిమా విడుదలకు నో చెప్పేసింది.

ఓ మై గాడ్​

దేవుడిని నమ్మని హీరో పరేశ్ రావల్​ ప్రకృతి వైపరీత్యం వల్ల తన ఆస్తిని పొగొట్టుకొని వీధిపాలవుతాడు. ఆ సమయంలో బీమా సంస్థలకు డబ్బు చెల్లించాలని కోరగా దేవుడి చర్యవల్ల జరిగిన దానికి వారు చెల్లించేందుకు నిరాకరిస్తారు. తర్వాత హీరో​ దేవుడి ఉనికినే ప్రశ్నిస్తూ ఆయనతోనే పోరాటం చేస్తాడు. అలా దేవుడి పేరు చెప్పుకు తిరిగే దొంగ బాబాల పని పడతాడు. ఈ కథాంశంతో రూపొందిన చిత్రమే 'ఓ మై గాడ్​'. ఇందులో దేవుడిగా అక్షయ్ కుమార్ కనిపించాడు. తెలుగులో 'గోపాల గోపాల' పేరిట విడుదలైంది. దేశవ్యాప్తంగా మంచి హిట్​ అయిన ఈ చిత్రాన్ని పలు మధ్య- తూర్పు దేశాలు నిరాకరించాయి. దేవుడిని నిందించడం అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని భావించిన ఆయా దేశాలు రిలీజ్​కు నో చెప్పేశాయి. వీటిలో యూఏఈ కూడా ఉంది.

ది డర్టీ పిక్చర్​

నటి సిల్క్​ స్మితా జీవిత కథతో తెరకెక్కి మంచి విజయం దక్కించుకున్న 'ది డర్టీ పిక్చర్​' చిత్రం విదేశాల్లోకి చేరుకోలేకపోయింది. ఈ సినిమాతో విద్యాబాలన్ నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో విద్యాబాలన్​ పాత్ర ఇబ్బందికరంగా ఉందని భావించిన కువైట్​ ఈ సినిమా విడుదలకు నిరాకరించింది.

దిల్లీ బెల్లీ

ఇమ్రాన్​ ఖాన్, వీర్​దాస్​, కునాల్​ రాయ్​కపూర్​లు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'దిల్లీ బెల్లీ'. ఇండియా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమాను నేపాల్​లో బ్యాన్​​ చేశారు. ఇందులో అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉన్నందున ఈ చిత్ర విడుదలపై ఆంక్షలు విధించారు. నేపాల్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందనే కారణంతో అక్షయ్​ కుమార్​ నటించిన 'చాందిని చౌక్​ టూ చైనా'ను కూడా నిషేధించారు.

బొంబాయి

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'బొంబాయి' సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రెండు వేరు వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడం ముఖ్యాంశంగా సాగుతుంది ఈ సినిమా. దీని వల్ల మతపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తుందని భావించిన సింగపూర్​ ప్రభుత్వం.. ఈ చిత్రాన్ని తమ దేశంలో నిషేధించింది.

ఫిజా

హృతిక్ రోషన్​, కరిష్మా కపూర్​, అమన్​ ఇక్రముల్లా, జయాబచ్చన్​ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఫిజా' సినిమా ఓ కల్పితక థాంశంతో రూపొందింది. ఇందులో హృతిక్​ రోషన్ ఓ మధ్య తరగతి ముస్లిం కుర్రాడిగా కనిపించాడు. ఆర్థికంగా ఎదిగేందుకు ఇంటినుంచి పారిపోతాడు. అయితే ఈ సినిమా ఓ ముస్లిం తీవ్రవాది కాదని చూపిస్తుంది. ఈ సినిమాను మలేసియా బ్యాన్​ చేసింది.

బేబీ

అక్షయ్​ కుమార్​ ప్రధాన పాత్రలో నటించిన 'బేబీ' చిత్రం మంచి విజయం దక్కించుకున్నప్పటికీ.. పాకిస్థాన్​లో ఈ సినిమా విడుదలకు నిరాకరించింది అక్కడి ప్రభుత్వం. ఎందుకంటే ఓ పాకిస్థాన్​ తీవ్రవాదిని పట్టుకునేందుకు హీరో దుబాయ్​లో ఓ రహస్య మిషన్​లో భాగస్వామిగా ఉంటాడు. పాకిస్థాన్​ను అలా చూపించారనే కారణంతో అక్కడి సెన్సార్​ బోర్డు ఈ సినిమా విడుదలపై ఆంక్షలు విధించింది.

రాంఝానా

ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతి మధ్య సాగే రొమాంటిక్ ప్రేమకథా చిత్రం 'రాంఝానా'. ధనుష్​, సోనమ్​ కపూర్​ హీరోహీరోయిన్లు. ఈ సినిమా మన దేశంలో మంచి విజయం దక్కించుకుంది. అయితే హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమించుకోవడం ఏమిటని భావించిన పాకిస్థాన్.. ఈ సినిమా విడుదలకు నిరాకరించింది.

ఏజెంట్​ వినోద్​

సైఫ్​ అలీఖాన్ హీరోగా నటించిన 'ఏజెంట్​ వినోద్​' సినిమా సూపర్ హిట్​ అయింది. ఉగ్రవాదం నేపథ్యంలో సాగే ఈ సినిమాపై పాకిస్థాన్​ సెన్సార్​ బోర్డు ఆంక్షలు విధించింది.

తేరే బిన్​ లాడెన్​

'తేరే బిన్ లాడెన్' సినిమాను పాకిస్థాన్ బ్యాన్ చేసింది. మనీశ్​ పౌల్​, సికేందర్​ ఖేర్​, ప్రధుమన్​ సింగ్​ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అమెరికా రహస్య మిషన్ ద్వారా చంపిన అల్​-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్​.. వివాదాస్పద సమస్య ఆధారంగా తెరకెక్కింది. అందుకే పాకిస్థాన్ ఈ సినిమా విడుదలను నిరాకరించింది.

బంగిస్థాన్​

'బంగిస్థాన్​' సినిమా ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదుల కథాంశంతో రూపొందింది. ఈ కథ పాకిస్థాన్​కు అభ్యంతరకరంగా ఉండడం వల్ల ఈ చిత్రం విడుదలకు పాక్​ నిరాకరించింది.

ఉడ్తా పంజాబ్​

'ఉడ్తా పంజాబ్​' ఈ సినిమా పేరు విషయంలోనే అనేక వివాదాల్లో నిలిచింది. షాహిద్​ కపూర్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాలో అసభ్యకర పదజాలం వాడటం, పాకిస్థాన్ నుంచి మాదకద్ రవ్యాలను తీసుకొచ్చి పంజాబ్​లో ఓ యువకుడు విక్రయిస్తున్నాడనే కారణంతో పాకిస్థాన్ సినిమా రిలీజ్​పై ఆంక్షలు విధించింది.

నీర్జా

ఎయిర్​ హోస్టస్​(గగనసఖి) నీర్జా నిజ జీవిత కథతో రూపొందింది ఈ సినిమా. పాకిస్థాన్ ఉగ్రవాదులు ఓ విమానాన్ని తమ అదుపులోకి తీసుకోగా అందులో ఉన్న ప్రయాణికులను రక్షించేందుకు నీర్జా తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. ఈ సినిమాను పాకిస్థాన్​లో బ్యాన్​ చేశారు.

డిషుమ్​

భారత బ్యాట్స్​మాన్​ అదృశ్యమైన కథాంశంతో రూపొందిన సినిమా 'డిషుమ్'. వరుణ్​ ధావన్, జాన్ అబ్రహమ్​ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఉన్న కామెడీ అభ్యంతరకరంగా ఉందని పాకిస్థాన్​ సెన్సార్​ బోర్డు ఈ సినిమాను బ్యాన్​ చేసింది. అంతే కాకుండా తమ దేశాన్ని తక్కువ చేసి చూపించారని ఆరోపించింది.

ఫాంటమ్​

సైఫ్​ అలీఖాన్, కత్రినా కైఫ్​ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం 'ఫాంటమ్​'. ఇందులో పాకిస్థాన్ మాస్టర్​మైండ్​ హఫీజ్​ సైద్​ను ముంబయి దాడుల్లో సంబంధం ఉన్నట్లు చూపించారనే కారణంతో.. సినిమా విడుదలకు నిరాకరించింది పాక్​ సెన్సార్​.

ఇదీ చదవండి: బాలయ్యతో 'ఆర్ఎక్స్100' భామ రొమాన్స్!​

Last Updated : Mar 20, 2020, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.