నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు చూస్తూ గంటలు గంటలు సమయం గడిపేస్తున్నారా? మీరు కనుక కొన్ని నిమిషాల పాటు ఈ యాప్ సెట్టింగ్స్ సెక్షన్‌ను ఓసారి గమనిస్తే మరింత ఆహ్లాదకరంగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. సబ్‌టైటిల్స్, హోమ్ స్క్రీన్ ప్రివ్యూస్, డౌన్లోడ్ సెట్టింగ్స్.. తదితర సెట్టింగ్స్‌తో ఈ యాప్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చుకోవచ్చు. అవేంటో చూసేయండి.
ఆఫ్లైన్లోనూ చూడొచ్చు
ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్లాగే నెట్‌ఫ్లిక్స్‌లోని సినిమాలు, సిరీస్‌లనూ ఆఫ్‌లైన్‌లో వీక్షించొచ్చు. మీరేదనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసి ఆఫ్లైన్లోనూ చూసి ఆస్వాదించొచ్చు. ఇందుకోసం ఈ సెట్టింగ్స్ మార్చుకోండి.
ప్రొఫైల్ - యాప్ సెట్టింగ్స్ - డౌన్లోడ్స్ - వీడియో క్వాలిటీ.. ఇక్కడ క్వాలిటీనీ 'స్టాండర్డ్' లేదా 'హయ్యర్'గా మార్చుకోండి. తర్వాత 'డౌన్లోడ్'పైనా క్లిక్ చేయండి. అనంతరం మీ డివైస్‌లోని డౌన్లోడ్ సెక్షన్లో ఆ మూవీ లేదా సిరీస్‌ను వీక్షించండి.
నచ్చకపోతే తొలగించండి
కొన్నిసార్లు మీరు నెట్‌ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేయగానే కొన్ని అసభ్యకర టైటిల్స్‌తో సిరీస్‌లు, సినిమాలు, టీవీ షోలు మీ వాచింగ్ లిస్ట్‌లో కనిపించొచ్చు. ఇది మీకు ఇబ్బందిగా ఉంటే అలాంటి వాటిని కనపడకుండా చేయొచ్చు. దానికోసం మీ వాచింగ్ లిస్ట్‌ను తొలగించండి. ఇందుకోసం ఈ సెట్టింగ్స్ చేసుకోండి.
ప్రొఫైల్ - అకౌంట్ - యువర్ ప్రొఫైల్ - వ్యూయింగ్ ఆక్టివిటీ.. ఇక్కడ టైటిల్ పక్కనున్న'హైడ్' బటన్‌ను క్లిక్ చేస్తే ఇకపై ఆ సిరీస్, మూవీ మీకు కనపడదు.
స్మార్ట్ డౌన్‌లోడ్స్‌తో మరింత సులభం
పని చేసే సమయంలో లేక మీ ఇంటర్నెట్ సరిగా లేని సమయంలో ఏదైనా మూవీని, కానీ సిరీస్ ఎపిసోడ్‌ను కానీ డౌన్లోడ్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటపుడు 'స్మార్ట్ డౌన్లోడ్' ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వైఫ్ ఆన్ చేయగానే పూర్తయిన ఎపిసోడ్స్‌ను తొలగించి కొత్త ఎపిసోడ్స్‌ను ఆటోమెటిక్‌గా డౌన్లోడ్ చేసేస్తుంది. ఇందుకోసం..
ప్రొఫైల్ - యాప్ సెట్టింగ్స్ - స్మార్ట్ డౌన్లోడ్..కు వెళ్లి ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోండి.
మొబైల్ డేటా ఎక్కువగా వాడేస్తున్నారా?
నెట్‌ఫ్లిక్స్‌లోని షోలు, మూవీలు ఎక్కువ క్వాలిటీతో ఉండటం వల్ల మీ డేటా ఎక్కువగా ఖర్చయ్యే ప్రమాదం ఉంది. అలాంటపుడు చిన్న సెట్టింగ్స్‌తో మీ డేటా తక్కువగా వినియోగం అయ్యేలా చేసుకోండి. ఇందుకోసం
ప్రొఫైల్ - యాప్ సెట్టింగ్స్ - మొబైల్ డేటా యూసేజ్‌కు వెళ్లి 'ఆటోమేటిక్' ఫీచర్‌ను తొలగించి.. 'సేవ్ డేటా' ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోండి.
హెచ్డీ-4కే ఎలా చూస్తున్నారో తెలుసుకోండి?
మీరు కొన్నిసార్లు 4కే ప్లాన్ కొనుగోలు చేసి 720 పిక్సల్లో వీడియోలు చూస్తూ ఉండొచ్చు. సెట్టింగ్స్ సరిగా చేయకపోతే ఇలా జరుగుతుంది. అలాంటపుడు నెట్‌ఫ్లిక్స్ 'ప్లే బ్యాక్ సెట్టింగ్స్' పేజీలోకి వెళ్లి 'డేటా యూసేజ్ పర్ స్క్రీన్'లో 'హై' ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోండి.
సబ్‌టైటిల్ సెట్టింగ్స్
సబ్‌టైటిల్స్ చదవడం కష్టంగా మారిందా? అలాంటపుడు దానికి సంబంధించిన ఫాంట్, కలర్, సైజ్‌ను చేంజ్ చేసుకుని ఆస్వాదించండి. ఇందుకోసం ప్రొఫైల్ - అకౌంట్ -సబ్‌టైటిల్ అప్పియరెన్స్.. ఇక్కడకు వెళ్లి మీరు 'టైటిల్ ఫాంట్, అక్షరాల సైజ్, షాడో బ్యాక్‌గ్రౌండ్ కలర్, విండో కలర్లను చేంజ్ చేసుకోవచ్చు.
లాక్ చేయండి
నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తున్నారా? అయితే మీ ప్రొఫైల్ ప్రైవేట్‌గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీ ప్రొఫైల్‌కు ప్రైవసీ కావాలనుకుంటే ఇలా చేయండి.
ప్రొఫైల్ - అకౌంట్ - ప్రొఫైల్ లాక్.. ఇక్కడకు వెళ్లి మీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి. తర్వాతి పేజ్‌లో 'రిక్వైర్ ఏ పిన్ టూ యాక్సెస్ (యూజర్) అకౌంట్' ఆప్షన్‌ను ఎంచుకుని.. నాలుగంకెల పిన్ను టైప్ చేయండి. తర్వాత సేవ్ చేసుకోండి. ఇకపై మీరు నెట్‌ఫ్లిక్స్‌ను ఓపెన్ చేసినపుడు ఈ పిన్ అడుగుతుంది.
అడల్డ్ కంటెంట్ వద్దా?
మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ కనుక మీ పిల్లలకు, యువకులకు ఇస్తే అడల్ట్ కంటెంట్ ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అలాంటపుడు దీనిని డిసేబుల్ చేసుకోండి. అందుకోసం ప్రొఫైల్ - అకౌంట్ - వ్యూయింగ్ రెస్ట్రిక్షన్స్కు వెళితే పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీరు చూసే కంటెంట్ ఏ వయసు వరకు ఉండాలో ఎంచుకోవచ్చు. (ఉదా- 7+ టూ 18+). కిందకు వెళితే మీకు నచ్చని అసభ్యకర మూవీ, షోను డిలీట్ కూడా చేయొచ్చు.
ఏం చూడాలో తెలియట్లేదా?
అప్పుడప్పుడు ఏం చూడాలి? అని తికమక పడుతూ ఉంటాం. అలాంటి వారికోసమే నెట్‌ఫ్లిక్స్ ఈ 'షఫిల్ ప్లే' ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అయితే మీరు ఇప్పటివరకు చూసిన కంటెంట్‌ను బట్టి ఈ సిరీస్ చూడండి.. అంటూ రికమెండ్ చేస్తుంది. ఇందుకోసం టీవీ యాప్స్ ఆప్షన్ సైడ్ బార్ దగ్గర 'షఫిల్ ప్లే' ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోండి.
ఇవీ చూడండి: ఈ యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి.. గూగుల్ హెచ్చరిక