చర్మం ముడతలు(HEALTHY SKIN) పడటం వల్ల వయసు మీరిన వారిలా కనిపిస్తారు. అలా కాకుండా స్కిన్ ఆరోగ్యంగా, బిగుతుగా(TIGHT SKIN) ఉండాలంటే ఏం తినాలో, తాగాలో చూద్దామా..
నీళ్లు(WATER)... డీహైడ్రేషన్ బారిన పడితే రాను రాను మీ చర్మం మందంగా మారి, త్వరగా ముడతలు పడిపోతుంది. దీంతో చిన్న వయసుకే వయసు మీద పడినట్లు కనిపిస్తుంది. ఒంట్లో తేమ శాతం తగ్గకుండా చేయడంతో చర్మం మెరుస్తూ ఉంటుంది. నీటిని సమృద్ధిగా తాగితే చర్మం సాగదు, ముడతలు పడదు. ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.
విటమిన్ ఏ(VITAMIN A) : విటమిన్ ఏ కోడిగుడ్డు(EGGS)లో ఉంటుంది. ఇది చర్మం ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుడ్డు పచ్చసొనలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అవి చర్మానికి తేమను ఇస్తాయి. అయితే, గుడ్డు తెలుపులో రంధ్రాలను బిగించే అల్బుమిన్ ఉంటుంది. అలాగే బొప్పాయిలో ఉండే అధిక యాంటీఆక్సిడెంట్ మన చర్మానికి ఆరోగ్యకరమైన నిగారింపును ఇస్తుంది. దీనిలోని విటమిన్ ఏ, పాపైన్ కొల్లాజెన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది.
విటమిన్ బి(VITAMIN B) : ఇది పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్-ఇ(VITAMIN E)... దీని లోపం వల్ల కూడా ముడతలు వస్తాయి. అందుకే ఈ విటమిన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే పదార్థాలను రోజూ తీసుకోవాలి. రాజ్మా, అవిసెగింజలు, బాదం, కాజులనూ తీసుకోవాలి.
విటమిన్-సి(VITAMIN C)... జామ, ఉసిరి, సంత్రా... తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తి(IMMUNITY POWER)ని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతాయి.
కొబ్బరి(COCONUT)... చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
సోయాబీన్, మొలకలు... వీటితో కూడా చర్మం ఆరోగ్యంగా(HEALTHY SKIN) ఉంటుంది.
ఇదీ చూడండి: బ్యూటీ ట్రెండ్ : చర్మ సౌందర్యానికి చార్‌కోల్