ETV Bharat / jagte-raho

భర్తతో గొడవపడి చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

ఇంట్లో భర్తతో గొడవైంది. అన్నతో తన బాధ చెప్పుకుందమని వస్తే.. వాళ్లు లేకపోయేసరికి తీవ్రంగా కుంగిపోయిన ఓ మహిళ నేరుగా చెరువు దగ్గరికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భువనగిరి పట్టణంలో జరిగింది.

భర్తతో గొడవపడి చెరువులో మహిళ ఆత్మహత్య
భర్తతో గొడవపడి చెరువులో మహిళ ఆత్మహత్య
author img

By

Published : Nov 1, 2020, 7:51 AM IST

Updated : Nov 1, 2020, 8:22 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు హైదరాబాద్​లోని అల్వాల్​కి చెందిన పద్మ(55) గా పోలీసులు గుర్తించారు. పద్మ తన భర్తతో గొడవపడి భువనగిరిలో ఉన్న తన అన్న ఇంటికి వచ్చింది.

వారు ఇంటి వద్ద లేకపోవడం వల్ల మరింత కుంగిపోయిన పద్మ చెరువు కట్ట వద్దకు చేరుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు బంధువులు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: మైనర్​ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

Last Updated : Nov 1, 2020, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.