ETV Bharat / jagte-raho

కిటికీలు తొలగించి బ్యాంకులో చోరీకి యత్నం - ఎస్​బీఐ బ్యాంక్​లో చోరీకి యత్నం

నిజమాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ ఎస్​బీఐ బ్యాంక్​లో ఆదివారం రాత్రి పలువురు దుండగులు దొంగతనానికి ప్రయత్నించారు. బ్యాంకు ఇనుప కిటికీలు కట్ చేసి చోరీకి యత్నించారు. లాకర్​​కు కన్నం వేయడానికి నానాతంటాలు పడ్డారు. విఫలమై చివరికి బ్యాంకులో ఫర్నీచర్​ ధ్వంసం చేసి వెళ్లిపోయారు.

Thieves Attempt to Theft in sbi bank at nizamabad district
కిటికీలు కట్ చేసి బ్యాంకులో చోరీకి యత్నం
author img

By

Published : Sep 21, 2020, 3:42 PM IST

నిజమాబాద్ జిల్లాలో ఈ మధ్యకాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. దేవాలయాలు, ఇళ్లల్లో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి సాటపూర్ ఎస్​బీఐ బ్యాంక్​లో పలువురు దోపిడీకి విఫలయత్నం చేశారు.

బ్యాంక్​ లాకర్లు తెరుచుకోకపోవడం వల్ల ఫర్నీచర్​ని ధ్వంసం చేశారు. బ్యాంక్​లోని సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో ఆధారంగా దొంగలను పట్టుకుంటామని బోధన్ సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. బ్యాంక్ సమయం ముగించుకుని వెళ్లేముందు మేనేజర్లు తాళాలు, లాకర్లు, అలారం సిస్టమ్స్ ను సరిగా చూసుకోవాలని పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి : అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 500 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.