భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఏఎంసీ కాలనీలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4960 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రతిరోజు కొందరు యువకులు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పట్టణ ఎస్ఐ నరేశ్ చాకచక్యంగా వ్యవహరించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: కడుపుపై కొట్టిన కరోనా... పనిలేక పేద బతుకులు విలవిల