సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం దొండపాడులో అర్ధరాత్రి కారులో అక్రమంగా తరలిస్తోన్న మద్యాన్ని గ్రామస్థులు పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సుమారు 1,000 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యాన్ని నల్గొండ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
మరోవైపు చింతలపాలెం మండల కేంద్రంలో ఉన్న వైన్ షాపులో మద్యం కోసం వెళ్తే ఒకటి లేదా రెండు బాటిళ్లు మాత్రమే ఇస్తున్నారని.. మిగిలింది ఎక్కువ రేటుకు ఆంధ్రాకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి: ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.8 వేల నగదు స్వాధీనం