ETV Bharat / jagte-raho

మొన్న భార్య ఆత్మహత్య.. ఇవాళ భర్త బలవన్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రాధిక, శ్రీనివాస్‌రెడ్డి దంపతులు. నాలుగు రోజుల క్రితం రాధిక ఉరేసుకుని చనిపోగా... మృతురాలి తల్లిదండ్రులు మృతురాలి భర్తపైనే నేరారోపణలు చేశారు. మనస్తాపంతో భర్త శ్రీనివాస్ రెడ్డి తనువు చాలించాడు.

మనస్తాపంతో భర్త ఆత్మహత్య
మనస్తాపంతో భర్త ఆత్మహత్య
author img

By

Published : Feb 14, 2020, 6:35 AM IST

Updated : Feb 14, 2020, 9:52 AM IST

అనుమానాస్పద స్థితిలో నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తే హత్య చేసి ఆధారాలు లేకుండా చేశాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర ఆరోపణలతో మనస్తాపం చెందిన భర్త... తనువు చాలించాడు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన రాధిక వివాహం ఘట్‌కేసర్‌ మండలం ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డితో 2006లో జరిగింది.

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 10న ఇంట్లో రాధిక ఫ్యాన్‌కు చీర సాయంతో ఉరేసుకుంది. మనస్తాపం చెందిన భర్త ఘట్‌కేసర్‌-బీబీనగర్‌ మార్గంలో రైలు పట్టాలపై పడి బలవన్మరణానికి ఒడిగట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి : వివాహిత అనుమానస్పద మృతి.. బంధువుల ఆందోళన

Last Updated : Feb 14, 2020, 9:52 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.