సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సూర్యతండాలో విషాదం జరిగింది. ఆడుకుంటూ వెళ్లిన ఓ చిన్నారి నీటికుంటలో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన లకావత్ శంకర్, గౌతమిల కుమార్తె హాసిని (16నెలలు) ఇంట్లో ఎవరులేని సమయంలో ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న నీటికుంటలో పడి మృతి చెందింది.
ఆసమయంలో బాలిక తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లారు. తమ బిడ్డ మృతిపట్ల వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.