ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాల పరంపర కొనసాగిస్తోంది. గురువారం రెండు వేర్వేరు క్షిపణులతో ఆ దేశం ప్రయోగాలు నిర్వహించినట్లు దక్షిణ కొరియా మిలిటరీ అధికారులు తెలిపారు. ఆ రెండూ తక్కువ దూరాన్ని ఛేదించగల క్షిపణులుగా భావిస్తున్నారు. ఒకటి 270కి.మీ మేర దూసుకెళితే మరొకటి 420కి.మీ వరకు చేరుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ నుంచి ఈ వారంలో రెండుసార్లు ఈ తరహా ప్రయోగాలు జరిగాయి.
ప్యోంగాంగ్లో అణ్వాయుధ పరీక్షలు నిలిపివేసేలా చర్యలు చేపట్టేందుకు అమెరికా రాయబారి దక్షిణ కొరియాలో పర్యటించిన రోజే క్షిపణులను ప్రయోగించింది ఉత్తర కొరియా.
రోజువారీ కార్యకలాపాల్లో భాగంగానే శనివారం డ్రిల్లింగ్ నిర్వహించినట్లు ఉత్తర కొరియా మిలిటరీ అధికారులు తెలిపారు. దాని వల్ల ఎవరికీ హాని ఉండబోదని వివరణ ఇచ్చారు. ఎక్కువ దూరాన్ని ఛేదించే క్షిపణులను ప్రయోగించలేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి- రివ్యూ: గెలుపును పంచేవాడే 'మహర్షి'