ETV Bharat / international

భారత్​తో బ్రిటన్​ భారీ వాణిజ్య ఒప్పందం - బ్రిటన్​ భారత్​ బంధం

భారత్​- బ్రిటన్​ మధ్య వాణిజ్య బంధం మరింత బలపడనుంది. భారత్​తో జీబీపీ 1 బిలియన్​ విలువ గల ఒప్పందాన్ని బ్రిటన్​ ప్రకటించింది. మంగళవారం జరగనున్న బోరిస్​- మోదీ సమావేశంలో దీనిపై నేతలు సంతకాలు చేయనున్నారు.

Modi-Boris virtual summit brings GBP 1 bn worth of deals, Enhanced Trade Partnership
భారత్​తో బ్రిటన్​ భారీ వాణిజ్య ఒప్పందం
author img

By

Published : May 4, 2021, 8:20 AM IST

భారత్​తో వాణిజ్య-పెట్టుబడులను మరింత బలోపేతం చేసే దిశగా బ్రిటన్​ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈటీపీ(ఎన్​హాన్సడ్​ ట్రేడ్​ పార్ట్​న్నర్​షిప్​)లో భాగంగా జీబీపీ 1 బిలియన్​ విలువ గల ఒప్పందాలు భారత్​తో కుదుర్చుకోనుంది బ్రిటన్​. ఫలితంగా బ్రిటన్​లో 6,500 కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి. మంగళవారం జరగనున్న భేటీలో భారత్​-బ్రిటన్​ ప్రధానులు నరేంద్ర మోదీ- బోరిస్​ జాన్సన్​లు ఈ ఈటీపీపై సంతకాలు చేస్తారు.

2030 నాటికి బ్రిటన్​-భారత్​ వాణిజ్య విలువను రెండింతలు చేసేందుకు ఈ ఈటీపీ ఉపయోగపడుతుంది. ఎఫ్​టీఏ(ఫ్రీ ట్రేడ్​ అగ్రీమెంట్​) వైపు అడుగులు వేసేందుకు ఇది పనికొస్తుంది.

"భారత్​-బ్రిటన్​ భాగస్వామ్యంలో ఇతర అంశాల్లాగే ఆర్థిక బంధం కూడా బలమైనది. మేము ప్రకటించిన 6,500 ఉద్యోగాలు కరోనా నుంచి కోలుకునేందుకు ఉపయోగపడతాయి. రానున్న దశాబ్ద కాలంలో.. భారత్​-బ్రిటన్​ వాణిజ్య విలువ రెండింతలయ్యేందుకు ఇది ఉపయోగపడుతుంది."

--- బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధానమంత్రి.

ఇందులో జీబీపీ 533 మిలియన్లు.. భారత్​ నుంచి బ్రిటన్​కు పెట్టుబడిగా వెళతాయి. ఆరోగ్యం, సాంకేతిక రంగాల్లో ఈ పెట్టుబడులు ఉండనున్నాయి. ఇందులో జీబీపీ 240 మిలియన్లు.. సీరం సంస్థ బ్రిటన్​లో పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1 బిలియన్​ డాలర్ల వ్యాపారం జరుగుతుందని బ్రిటన్​ ప్రభుత్వం అంచనా వేసింది.

ఎగుమతులకు సంబంధించి మరో జీబీపీ 446 మిలియన్ల ఒప్పందాలు ఇందులో భాగం కానున్నాయి. ఫలితంగా బ్రిటన్​లో 400 అదనపు ఉద్యోగాలు లభించనున్నాయి.

అదే సమయంలో ఈటీపీలో భాగంగా భారత్​లో బ్రిటన్​ వ్యాపారాలకు అవకాశాలు పెరగనున్నాయి. ఆహారం, జీవశాస్త్రం, సేవా రంగాల్లో ఇవి ఉండనున్నాయి.

ఇదీ చూడండి:- బ్రిటన్​ నుంచి భారత్​కు మరో 1000 వెంటిలేటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.