భారత్‌తో ఉద్రిక్తతలు తగ్గేందుకు తీవ్రంగా కృషి చేశారని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రసంశలు కురిపించింది పాకిస్థాన్ పార్లమెంటు. నోబెల్ శాంతికి ఇమ్రాన్ అర్హుడని, ప్రతిపాదనలు పంపేందుకు తీర్మానించింది.
జాతీయ అసెంబ్లీ సచివాలయంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి.
"భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేసి.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను ప్రధాని ఇమ్రాన్ తగ్గించారు. ఈ విషయంలో ఆయన బాధ్యతాయుతంగా ప్రవర్తించారు. ఆయన నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడు."
-ఫవాద్ చౌదరి, పాక్ సమాచార శాఖ మంత్రి
ఈ తీర్మానంపై సభలో సోమవారం చర్చ జరిగే అవకాశం ఉంది. తీర్మానం ఆమోదం పొందేందుకు కావాల్సిన మెజారిటీ ఇమ్రాన్ ప్రభుత్వానికి ఉంది. విపక్షాలు సైతం అంగీకరిస్తే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది.
ఇదీ చూడండి:సంఝౌతా పునఃప్రారంభం