
యెమన్‌లో ఉగ్రవాద నిర్మూలనకు యూఏఈ రక్షణ దళాలు చాలా కాలంగా మోహరించాయి. దీర్ఘకాలం పాటు సాగే యుద్ధం వల్ల యెమన్‌లో జనాభా తగ్గిపోతుందని పోప్ అన్నారు. చాలా మంది పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు కానీ ఆహారాన్ని పొందలేకపోతున్నారని పోప్ అన్నారు. ఆహార పంపిణీకి భరోసా కల్పించే సంస్థల ఒప్పందాలను అనుమతించాలని అంతర్జాతీయ సంస్థలను, సంబంధిత పార్టీలను కోరారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇరు మతాల సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం క్రైస్తవ మత సభ్యులతో సమావేశం కానున్నారు.
" అరేబియన్ గల్ఫ్ చరిత్రలో అతి పెద్ద క్రైస్తవ ఆరాధన నిర్వహణను మేం చూస్తున్నాం. అందులో మేము భాగమైనందుకు సంతోషిస్తున్నాం."
- ఆండ్రూ థామ్సన్, సెయింట్ ఆండ్రూ ఆంగ్లికన్ చర్చి ప్రతినిధి, అబుదాబి
యూఏఈలో ఫిలిప్పైన్స్, భారత్ నుంచి వచ్చిన సుమారు పది లక్షల మంది క్యాథలిక్ వలసదారులు నివాసముంటున్నారు. మంగళ వారం జియాద్ స్పోర్ట్ సిటీ మైదానంలో నిర్వహించే సమావేశానికి ఇప్పటికే సుమారు 135,000 మంది టికెట్స్ పొందారు.