ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇటీవల ముగిసిన భారత-ఈయూ నాయకుల సమావేశ సానుకూల ఫలితాలపై చర్చించారు.
ఈయూ సమావేశంలో నిర్ణయించిన సమగ్ర, సమతుల్య వాణిజ్య విధానం, పెట్టుబడులపై ఒప్పందాలు, భారత్, ఈయూ మధ్య సంబంధాల బలోపేతాన్ని ఇరువురు అంగీకరించారు. కరోనాపై ఫ్రాన్స్ సహాయ సహకారాలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రాంతీయ సవాళ్లు, ప్రపంచ సమస్యలపై నేతలు మాట్లాడుకున్నారని పీఎంవో వెల్లడించింది. ఈయూ సమావేశంలో జరిగిన చర్చలపై నేతలు సంతృప్తి చెందినట్లు పేర్కొంది.
మే 8న 27 దేశాల నేతలతో ఈయూ సమావేశం దృశ్య మాధ్యమంలో జరిగింది. దీనిలో పరస్పర భాగస్వామ్యం, సమగ్ర, సమతుల్య వాణిజ్య విధానంపై చర్చించారు.