ETV Bharat / international

బాలీవుడ్​ దిగ్గజ నటుల ఇళ్లకు బేరసారాలు

బాలీవుడ్​ దిగ్గజ నటులు రాజ్​ కపూర్​, దిలీప్​ కుమార్​ల పూర్వీకుల ఇళ్లకు బేరసారాలు జరుపుతోంది పాక్​లోని ఖైబర్​ పఖ్తూన్​ఖ్వా ప్రావిన్సు ప్రభుత్వం. వారి భవనాల కొనుగోలుకు ప్రావిన్సు ప్రభుత్వం ఇటీవలే రూ. 2.35 కోట్ల విడుదలకు ఆమోదించింది.

author img

By

Published : Jan 31, 2021, 6:08 AM IST

పాకిస్థాన్​లోని ఖైబర్​ పఖ్తూన్​ఖ్వా ప్రావిన్సు ప్రభుత్వం పెషావర్​లో ఉన్న బాలీవుడ్​ దిగ్గజ నటులు రాజ్​ కపూర్​, దిలీప్​ కుమార్​ల పూర్వీకుల ఇళ్ల కొనుగోలుకు ఆయా ఇళ్ల యజమానులతో సంప్రదింపులు జరుపుతోంది.

చారిత్రక ప్రాధాన్యమున్న ఈ భవనాలను ప్రదర్శన శాలలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు శనివారం ఓ సీనియర్​ అధికారి తెలిపారు. ఈ భవనాలు జాతీయ వారసత్వ సంపదగా 2014లోనే నవాజ్​ షరీఫ్​ ప్రభుత్వం ప్రకటించింది. భవనాల కొనుగోలుకు ప్రావిన్సు ప్రభుత్వం ఇటీవలే రూ. 2.35 కోట్ల విడుదలకు ఆమోదించింది.

దిలీప్​కుమార్​ పూర్వీకుల ఇంటికి రూ. 80.56 లక్షలు, రాజ్​కపూర్​ పూర్వీకుల ఇంటికి రూ. 1.50 కోట్లు ప్రభుత్వం తరఫున ధర నిర్ణయించారు. ఈ ధరలకు ఆయా భవనాల ప్రస్తుత యజమానులు ససేమిరా అంటున్నారు.

ఇదీ చూడండి: 'ఆ హీరో ఇల్లు 200 కోట్లు- కోటిన్నరకు ఎలా ఇస్తా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.