చైనా సరిహద్దును కలుపుతూ నిర్మించిన దార్చులా-టింకర్ రహదారి నేపాల్ ప్రారంభించింది. భారత్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ రోడ్డును నిర్మించింది నేపాల్. ఈ రహదారిని నేపాలీ సైన్యానికి ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
నేపాల్లోని దార్చులాలో సైన్యం నిర్మించిన 87 కిలోమీటర్ల రహదారిని పశ్చిమ ప్రదేశ్ ముఖ్యమంత్రి త్రిలోచన్ భట్ ప్రారంభించారు. ఈ రోడ్డు చింగారు, టింకర్ గ్రామస్థుల ఇబ్బందులను తొలగిస్తుందని వ్యాఖ్యానించారు. దీనిని ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.
మహకాళి నది ప్రాదేశిక జలాల కారణంగా 40 ఏళ్లుగా ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి. అందువల్ల ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకు చింగారు, టింకర్ ప్రాంత ప్రజలు భారత్పై ఆధారపడాల్సి వచ్చేది. అయితే, రెండు దేశాల మధ్య విభేదాల నేపథ్యంలో ఈ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేసింది నేపాల్.
ఇదీ చూడండి: నేపాల్- చైనా మధ్య కీలక వాణిజ్య మార్గం పునఃప్రారంభం