యోగా.. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ పేరును జపిస్తోంది. ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి యోగా ఎంతగా సహకరిస్తుందో ఇప్పుడిప్పుడే ప్రపంచ ప్రజలు తెలుసుకుంటున్నారు. వారికి అనువైన రీతిలో యోగాభ్యాసం చేస్తున్నారు. తాజాగా వెదురు బొంగు యోగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి అదేంటో తెలుసుకుందామా?
బొంగులో యోగా..
హాంగ్‌కాంగ్‌లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి నగరవాసులు సముద్రతీరాలకు చేరుకుంటున్నారు. వెదురు బొంగు యోగా చేస్తూ సేదతీరుతున్నారు.
అలెగ్జాండ్రా మిలేవిక్జ్ ఈ వెదురు యోగాను హాంగ్‌కాంగ్ ప్రజలకు పరిచయం చేశారు. సముద్రతీరంలో 3 వెదురు బొంగులతో ఏర్పాటుచేసిన ట్రైపాడ్‌కు వేలాడుతూ.. ఈ యోగా చేస్తారు. ప్రకృతిని ఆస్వాదిస్తూనే, ఆరోగ్యాన్ని మెరుగుదిద్దుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుందని ఆమె చెబుతున్నారు.
"నేను 2017 మే నెలలో వెదురు యోగా ప్రారంభించాను. థాయిలాండ్‌లో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్న సమయంలో నాకు ఈ ఆలోచన పుట్టింది. నేను వైమానిక శిక్షణ కూడా పొందాను. హాంగ్‌కాంగ్‌లో ఎంతో అందమైన ప్రకృతి, మంచి బీచ్‌లు ఉన్నాయని నాకు తెలుసు. అందువల్ల వెదురు యోగా అనే భావనను ఇక్కడకు తీసుకురావాలని ఆలోచించాను. ప్రస్తుతం ఇది బాగా పనిచేస్తోంది.
ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనేవారు నగరం నుంచి బయటపడాలని, మన చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. సురక్షితంగా, ఆరోగ్యంగా జీవించాలనే భావన వారంతట వారికి కలగాలని ప్రయత్నిస్తున్నాను." - అలెగ్జాండ్రా మిలేవిక్జ్, వెదురు యోగా వ్యవస్థాపకురాలు
ఇదీ చూడండి: వణికిపోయిన జర్మనీ ఛాన్స్లర్ మెర్కెల్