ఆస్ట్రేలియాకు సంబంధించి వార్తల ప్రచురణ, పంచుకోవటంపై ప్రస్తుతం తాము అమలు చేస్తున్న నిషేధాన్ని త్వరలోనే ఎత్తేస్తామని ఫేస్‌బుక్ ప్రకటించింది. వార్తలు ప్రచురించేందుకు సామాజిక మాధ్యమాలు రుసుము చెల్లించాలన్న నూతన మీడియా చట్టాన్ని ఫేస్‌బుక్‌తో పాటు గూగుల్ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కాగా చర్చల అనంతరం సదరు చట్టాన్ని సవరించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించడంతో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ఫేస్‌బుక్, ఆ దేశానికి సంబంధించిన న్యూస్ పేజీలపై నిషేధం విధించింది. ఫేస్‌బుక్‌లో వార్తలు అందుబాటులోకి లేకపోవటంతో ఆస్ట్రేలియా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో దిగొచ్చిన ప్రభుత్వం ఫేస్‌బుక్‌ను చర్చలకు ఆహ్వానించింది. ఈ క్రమంలో మీడియా చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో తాము కూడా న్యూస్ పేజీలపై నిషేధం ఎత్తేస్తున్నట్లు ఫేస్‌బుక్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఈస్టన్ వెల్లడించారు. ఈ మేరకు ఇరుపక్షాలు ఓ ఒప్పందానికి వచ్చినట్టు వారు ప్రకటించారు. సామాజిక మాధ్యమ సంస్థలతో తమకు మితృత్వమే ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చెప్పారు.
ఇదీ చూడండి: