ETV Bharat / international

చైనాకు మళ్లీ వైరస్ బెడద- రష్యా సరిహద్దుల్లో అప్రమత్తం

చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీజింగ్​ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారికే పాజిటివ్​ నిర్ధరణ కావడం వల్ల రష్యా సరిహద్దులకు వైద్య బృందాలను పంపించింది.

CHINA-RUSSIA-BORDER
చైనాకు మళ్లీ వైరస్ బెడద
author img

By

Published : Apr 15, 2020, 6:46 AM IST

చైనాలో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. అంతర్గతంగా వైరస్ వ్యాప్తి తగ్గినా.. విదేశాల నుంచి వస్తున్న వారికే మహమ్మారి సోకుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో కొంతమందికి లక్షణాలు లేనప్పటికీ కరోనా పాజిటివ్​గా వస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 89 కేసులు నమోదయ్యాయని.. వీరిలో ముగ్గురు విదేశాల నుంచి వచ్చినట్లు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో కరోనాకు కారణమైన వుహాన్ నగరానికి దగ్గరగా ఉన్న రష్యా సరిహద్దు వద్ద చైనా హై అలర్ట్​ ప్రకటించింది. దేశంలోకి వైరస్ రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాలకు వైద్య బృందాలను పంపింది.

సూఫెన్ పట్టణంలో..

రష్యా సరిహద్దులోని సూఫెన్​ పట్టణంలో ఇటీవల 22 మంది వైద్య నిపుణులతో ల్యాబ్​ను ఏర్పాటు చేశారు. 70 వేల మంది జనాభా ఉన్న ఈ పట్టణంలో నమోదైన వెయ్యి అనుమానిత కేసుల్లో 243 మంది విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. వీరిలో 100 మందికిపైగా కరోనా పాజిటివ్ వచ్చినా.. లక్షణాలు లేనట్లు గుర్తించారు. వీరిలో సగం మంది రష్యా నుంచి వచ్చినట్లు చైనా అధికారులు తెలిపారు.

ఈ పరిస్థితుల్లో రష్యా నుంచి వస్తున్నవారిని 30 రోజుల పాటు క్వారంటైన్​లో పెడుతోంది చైనా. వీరికి న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రష్యాతో వ్యాపారం..

చైనాలోని హిలాంగ్జియాంగ్ ప్రావీన్స్​తో రష్యాతోపాటు మంగోలియా దేశాలు సుదీర్ఘమైన సరిహద్దును పంచుకుంటున్నాయి. ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలకు ఈ సరిహద్దు నుంచి రాకపోకలు ఎక్కువగా లేకపోయినప్పటికీ.. దేశంలోకి వచ్చేందుకు ఇది ప్రధాన ప్రత్యామ్నాయ మార్గంగా ఉంది.

ఈ మార్గం ద్వారానే రష్యాలో పని, జీవనం కోసం చాలా మంది చైనీయులు వెళుతుంటారు. సూఫెన్ పట్టణం ఇందుకు కీలక వారధిగా పనిచేస్తుంది. ఉన్ని దుస్తులు, మొబైల్ ఫోన్లు, నిత్యవసర వస్తువుల హబ్​గా పనిచేస్తుంది.

ఇదీ చూడండి: కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టడంలో చైనా దూకుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.