కరోనా వైరస్ బారిన పడడానికి వయసుకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు జపాన్‌కు చెందిన హొకైడో విశ్వవిద్యాలయం పరిశోధకులు. ఇటలీ, జపాన్, స్పెయిన్‌లోని కొవిడ్ రోగులపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు. అయితే వయసును బట్టి వ్యాధి తీవ్రత పెరుగుతోందని పేర్కొంది. ఈ మేరకు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఓ కథనాన్ని ప్రచురించారు.
ఎక్కువ వయసు ఉన్న వారిలో కొవిడ్ తాలూకు లక్షణాలు అధికంగా బయటపడుతున్నట్లు వెల్లడైంది. మరణాలు రేటు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది మే వరకు ఇటలీలో ప్రతీ లక్ష మందిలో 382 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. స్పెయిన్‌లో 507.2, జపాన్‌లో 13.2 గా ఉంది.
ఇదీ చూడండి: ముందంజలో ఆక్స్ఫర్డ్ టీకా 'కొవిషీల్డ్': డీసీజీఐ