ETV Bharat / international

చైనాకు అమెరికా షాక్​.. విమానాలపై నిషేధం

చైనా విమానాలపై నిషేధం విధించింది అమెరికా. జూన్​ 16 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తుందని అగ్రరాజ్య రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇటీవల అమెరికాకు చెందిన రెండు ఎయిర్​లైన్స్​ విమానాలకు చైనా అనుమతులు నిరాకరించినందుకు ప్రతీకార్య చర్యగానే అమెరికా ఈ చర్యలు చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Chinese airlines
చైనా విమానాలపై నిషేధం
author img

By

Published : Jun 3, 2020, 9:23 PM IST

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య, ప్రయాణ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా చైనా విమానాలపై నిషేధం విధించాలని నిర్ణయించింది అగ్రరాజ్యం. చైనాకు చెందిన 4 విమాన సంస్థల ప్రయాణ విమానలపై నిషేధం ఉంటుందని అమెరికా రవాణా శాఖ వెల్లడించింది. అమెరికా నుంచి టేకాఫ్​, ల్యాండింగ్​లపై జూన్​ 16 నుంచి నిషేధం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.

కరోనా విజృంభణ నేపథ్యంలో చైనాకు విమానాలు నిలిపివేశాయి అమెరికాకు చెందిన డెల్టా, యునైటెడ్​ ఎయిర్​లైన్స్ సంస్థలు. అయితే.. ఈ వారంలో విమానాలను పునరుద్ధరించాలని ప్రయత్నించినప్పటికీ.. వాటికి​ అనుమతులు ఇవ్వలేదు చైనా. ఇందుకు ప్రతీకార చర్యగానే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

" ఇరుదేశాల మధ్య విమానరాకపోకలపై ఉన్న ఒప్పందాన్ని చైనా అతిక్రమించింది. చైనాతో కలిసి పనిచేస్తాం. ఇరుదేశాల విమాన సంస్థలు ద్వైపాక్షిక హక్కులను పూర్తిగా వినియోగించుకోవచ్చు. చైనా ప్రభుత్వం ఎన్ని విమానాలను అనుమతిస్తుందో అదే స్థాయిలో వారి విహంగాలకు మేమూ అనుమతిస్తాం. ఈ ఆదేశాలను అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ జూన్​ 16లోపు అమలులోకి తీసుకురావచ్చు."

- అమెరికా రవాణా విభాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.