దాహంతో ఉన్న ఓ గద్దకు బాటిల్‌తో నీరు అందించారు కొందరు బాటసారులు. హైవే పక్కన ఓ వ్యక్తి బాటిల్‌తో గద్దకు నీటిని తాగిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు దానిని నిశితంగా పరిశీలిస్తున్నారు. 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
-
Thirsty eagle..
— Buitengebieden (@buitengebieden_) May 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Thank you! 🙏 pic.twitter.com/ljmh7yMlDU
">Thirsty eagle..
— Buitengebieden (@buitengebieden_) May 24, 2021
Thank you! 🙏 pic.twitter.com/ljmh7yMlDUThirsty eagle..
— Buitengebieden (@buitengebieden_) May 24, 2021
Thank you! 🙏 pic.twitter.com/ljmh7yMlDU
ఆ వీడియోకు దాహంతో ఉన్న గద్ద మీకు కృతజ్ఞతలు తెలుపుతోంది అని క్యాప్షన్ ఇచ్చాడు ఆ నెటిజన్. ఇప్పటికే 4వేల లైక్స్, 53వేల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు గద్ద దాహం తీర్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. 'గద్దకు సాయం చేసిన వారికి నా కృతజ్ఞతలు' అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మరో వ్యక్తి 'అద్భుతం, మంచి పనిచేశారు.' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పులి, సింహం ఫైట్- గెలిచిందెవరు?