ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమానికి (యూఎన్డీపీ) అండర్ సెక్రటరీ జనరల్, అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా భారత ప్రముఖ పెట్టుబడిదారు ఉషా రావు మొనారీని నియమించారు ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్. బ్లాక్‌స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్‌కు సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న ఉషా రావు మొనారీని ఈ పదవుల్లో నియమించినట్లు ఐరాస ప్రతినిధి బుధవారం వెల్లడించారు. యూఎన్సీడీఎఫ్కు కార్యనిర్వాహక కార్యదర్శిగా భారత సంతతి మహిళ ప్రీతి సిన్హా నియమితులైన రెండు రోజులకే ఉషా ఎంపికయ్యారు.
సుస్థిరాభివృద్ధికి సంబంధించిన పలు సంస్థల బోర్డుల్లో ఉషా పనిచేస్తున్నారు. నీరు, జీవవైవిధ్యం, వాతావరణానికి సంబంధించిన విభాగాల్లో అడ్వైజరీగా సేవలు అందిస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ నుంచి 'ప్రపంచ వ్యవహారాలు, ఫైనాన్స్' విభాగంలో డిగ్రీ చేశారు.
ఇదీ చదవండి: మలాలాకు తాలిబన్ ఉగ్రవాది బెదిరింపులు