ETV Bharat / international

ఇద్దరు భారతీయ అమెరికన్లకు ఐరాసలో కీలక పదవులు

author img

By

Published : Jan 27, 2021, 9:21 PM IST

ఐరాసలోని అమెరికా మిషన్​కు చెందిన నాయకత్వ బృందానికి సలహాదారులుగా ఇద్దరు భారతీయ అమెరికన్లను నియమించారు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్. సోహినీ ఛటర్జీ, అదితీ గోరూర్​లకు ఈ మేరకు అవకాశం కల్పించారు.

Biden appoints 2 Indian Americans
ఇద్దరు భారతీయ అమెరికన్లకు ఐరాసలో కీలక పదవులు

ఇద్దరు భారత సంతతి అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించారు అధ్యక్షుడు జో బైడెన్​. ఐరాసలో అమెరికా మిషన్​కు చెందిన నాయకత్వ బృందానికి సలహాదారులుగా సోహిని ఛటర్జీ, అదితీ గొరూర్​ను నియమించారు.

మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా బృందంలో ప్రపంచ అభివృద్ధి అంశాలపై పనిచేసిన ఛటర్జీ... ఐరాసలోని అమెరికా మిషన్​ బృందంలో సీనియర్ సలహాదారుగా పనిచేయనున్నారు. గతంలో ఐరాసలో శాంతిభద్రతల విభాగంలో పనిచేసిన గొరూర్ కూడా సలహాదారుగా వ్యవహరించనున్నారు.

ఇటీవలే బైడెన్​... యూఎన్​లో అమెరికా శాశ్వత ప్రతినిధిగా లిండా థామస్-గ్రీన్​ ఫీల్డ్​ను ప్రకటించారు. సెనేట్​ సభ్యులు అనుమతించాక ఈమె శాశ్వత సభ్యురాలు కానున్నారు.

న్యాయవాదిగా మొదలై....

సోహిని ఛటర్జీని తొలుత న్యాయవాదిగా పినిచేశారు. తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీగా పనిచేశారు. ఇంటర్నేషనల్​ స్టడీస్​కు సీనియర్​ అసోసియేట్​గానూ వ్యవహరించారు. అంతర్జాతీయ సంస్థ స్టెప్టో అండ్​ జాన్సన్​కు న్యాయవాదిగా పనిచేశారు ఛటర్జీ.

ఇదీ చదవండి:బైడెన్​ బృందంలో కీలకంగా భారతీయులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.