మొరాకోలోని టాన్జియర్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాల వల్ల వరదలు ముంచెత్తాయి. వరదల వల్ల ఓ వస్త్ర కర్మాగారంలో పనిచేస్తోన్న 28 మంది కార్మికులు మరణించారని అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న మరో పది మందిని అగ్ని మాపక సిబ్బంది రక్షించినట్లు పేర్కొన్నారు.
అకస్మాత్తుగా వస్త్ర కర్మాగారాన్ని వరదలు ముంచెత్తాయన్నారు అధికారులు. దీనికి గల కారణాలను అన్వేషిస్తున్నామన్నారు. వరదల సమయంలో కర్మాగారంలో ఎంతమంది పనిచేస్తున్నారో తెలియదన్నారు. తాము ఎప్పటిలాగే పని చేస్తుండగా.. ఫ్యాక్టరీలోకి నెమ్మదిగా నీరు రావడం ప్రారంభమైదని ప్రత్యక్ష్య సాక్షులు వివరించారు. ఈ క్రమంలో వరద ఒక్కసారిగా ముంచెత్తిందని ప్రమాదం నుంచి బయటపడిన ఓ బాధితురాలు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఎన్నికలు జరిపి విజేతలకు పట్టం కడతాం'