ఆఫ్రికన్ దేశం బుర్కినాఫాసోలో దుండగులు జరిపిన కాల్పుల్లో 30మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోమంద్జరి ప్రాంతంలోని కోద్యేల్ గ్రామంలో ఈ దారుణం జరిగింది.
గ్రామంలోని ప్రతి ఇంటికీ ఉగ్రసంస్థకు చెందినవారు నిప్పంటించారని ప్రభుత్వాధికారి లబిడి ఔబా తెలిపారు.
ఇద్దరు స్పెయిన్ జర్నలిస్టులు, ఓ ఐర్లాండ్ వ్యక్తిని హత్య చేసిన వారం రోజులకే ఈ కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. వారం క్రితం కోద్యేల్కు సమీప ప్రాంతమైన సాహెల్లోని యాట్టకౌ గ్రామంలో 18 మందిని హత్యచేశారు.
ఇదీ చదవండి:కూలిన మెట్రో రైలు- 15 మంది మృతి