ETV Bharat / international

ప్రభుత్వం సంచలన నిర్ణయం- యువకుల చేతికి ఆయుధాలు - Burkina fights against jihadists

పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినాఫాసోలో ఉగ్రవాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ముష్కరులు దాడిచేసి 36 మందిని బలిగొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండించిన ఆ దేశ ప్రభుత్వం... తీవ్రవాదుల ఏరివేతకు ప్రజలు సహకరించాలని కోరింది. అర్హులైన యువకులకు ఆయుధాలు ఇచ్చి పోరులో భాగం చేసింది. దీనికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంటులో ఆమోదించింది.

36 civilians killed in northern Burkina Faso
బుర్కినాఫాసోలో ఉగ్రదాడులు
author img

By

Published : Jan 22, 2020, 2:17 PM IST

Updated : Feb 17, 2020, 11:42 PM IST

పశ్చిమాఫ్రికా దేశం బుర్కినాఫాసోలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం జరిపిన దాడుల్లో దాదాపు 36 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. నగ్రావోగో ప్రాంతంలోని ఓ మార్కెట్‌పై దాడి చేసి... తగలబెట్టడం ద్వారా ముష్కరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం పక్కనే ఉన్న గ్రామంలోకి వెళ్లి మరో నలుగురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి మొత్తం 36 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడుల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

యువకులకు ఆయుధాలిచ్చిన ప్రభుత్వం...

బుర్కినాఫాసో ప్రభుత్వం ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించింది. ముష్కరమూకల ఏరివేత కోసం జరుగుతన్న పోరులో ప్రజలు సహకరించాలని అభ్యర్థించింది. అర్హులైన యువకులకు ఆయుధాలు ఇచ్చి వారిని ఈ పోరులో భాగం చేసేందుకు సంబంధించిన ఓ బిల్లును అక్కడి పార్లమెంటు ఆమోదించింది.

2015లోనూ బుర్కినాఫాసోతో సహా పొరుగు ప్రాంతాలైన మాలి, నైగర్​లపై జరిగిన వరుస దాడుల్లో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాదీ ముష్కరులు మూడు సాహెల్​ దేశాలపై దండెత్తారు. అప్పుడు సుమారుగా 4000 మంది మృత్యువాతపడ్డారని ఐక్యరాజ్యసమితి నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: గర్భిణిని 6 కిలోమీటర్లు మోసుకెళ్లిన సీఆర్పీఎఫ్​ బృందం

Intro:Body:Conclusion:
Last Updated : Feb 17, 2020, 11:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.