puri jagannadh ram pothineni movie : లవర్ బాయ్‌గా ఉన్న రామ్ పోతినేని.. 'ఇస్మార్ట్ శంకర్'తో మాస్ ఇమేజ్ ట్యాగ్‌లైన్ తగిలించుకుని కెరీర్లో ముందుకెళ్తున్నారు. అయితే ఇప్పుడాయన 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా 'డబుల్ ఇస్మార్ట్' సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ముంబయిలో షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. అయితే ఈ సినిమాలో విలన్, హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. దీంతో ఎవరై ఉంటారా అనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది. ప్రతినాయకుడిగా బాలీవుడ్ యాక్టర్స్‌నే పూరి తీసుకుంటారని ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే ఆ ప్రచారాన్నే నిజం చేస్తూ మూవీటీమ్ పవర్ఫుల్ అప్డేట్ ఇచ్చింది.
double ismart movie villan : బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్‌దత్ బిగ్బుల్ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. డబుల్ ఇస్మార్ట్ ఇప్పుడు డబుల్ మాస్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే విలన్ అనే విషయాన్ని చెప్పలేదు. కానీ ఇప్పటికే సంజయ్ దత్ 'కేజీయఫ్' సిరీస్‌లో పవర్‌ఫుల్‌గా విలన్‌గా కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంకా పలు చిత్రాల్లోనూ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. కాబట్టి ఈ డబుల్ ఇస్మార్ట్‌లో ఆయనే విలన్ అని అర్థమవుతోంది. ఇకపోతే ఈ కొత్త పోస్టర్లో సంజయ్ దత్ లుక్ అదిరిపోయింది. బ్లాక్ కలర్ సూట్లో స్టైలిష్ హెయిర్ స్టైల్ అండ్ బియర్డ్ లుక్ అదిరిపోయింది. సీరియస్‌గా సిగార్ కాలుస్తూ కనిపించి మైండ్ బ్లో చేశారు.
-
Double ISMART is now Double MASS🔥🔥
— Puri Connects (@PuriConnects) July 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Team #DoubleISMART welcomes on board the powerhouse performer @duttsanjay for the most dynamic role #BIGBULL ❤️🔥#HBDSanjayDutt
IN CINEMAS MARCH 8th, 2024💥
Ustaad @ramsayz #PuriJagannadh@Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/DeoRFFkFeH
">Double ISMART is now Double MASS🔥🔥
— Puri Connects (@PuriConnects) July 29, 2023
Team #DoubleISMART welcomes on board the powerhouse performer @duttsanjay for the most dynamic role #BIGBULL ❤️🔥#HBDSanjayDutt
IN CINEMAS MARCH 8th, 2024💥
Ustaad @ramsayz #PuriJagannadh@Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/DeoRFFkFeHDouble ISMART is now Double MASS🔥🔥
— Puri Connects (@PuriConnects) July 29, 2023
Team #DoubleISMART welcomes on board the powerhouse performer @duttsanjay for the most dynamic role #BIGBULL ❤️🔥#HBDSanjayDutt
IN CINEMAS MARCH 8th, 2024💥
Ustaad @ramsayz #PuriJagannadh@Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/DeoRFFkFeH
ram pothineni ismart shankar : మొదటి భాగం 'ఇస్మార్ట్ శంకర్'లో కథానాయకుడు మెదడులోకి ఓ చిప్ ప్రవేశ పెట్టడంతో.. అతడికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, వాటని అతడు ఎలా ఎదుర్కొన్నాడు? అతడు ఎలా ప్రవర్తిస్తాడు? అనేది చూపించారు. అయితే ఈ సారి అంతకుమించి డబుల్ రేంజ్లో డబుల్ ఇస్మార్ట్‌లో చూపించనున్నట్లు ఇప్పటికే మూవీటీమ్ చెబుతోంది. ఇకపోతే 'లైగర్' డిజాస్టర్ అవ్వడం వల్ల భరీ స్థాయిలో దెబ్బతిన్న పూరి.. ఈ డబుల్ ఇస్మార్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో హై స్టాండర్డ్స్‌తో రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో మహా శివరాత్రి కానుకగా అన్ని భాషల్లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది మార్చి 8న చిత్రం రిలీజ్ కానున్నట్లు ఇప్పటీ మూవీటీమ్ తెలిపింది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి :
'డబుల్ ఇస్మార్ట్' వరల్డ్‌లోకి రామ్ ఎంటర్.. ఫుల్ లుక్ ఛేంజ్!