ETV Bharat / entertainment

ఆలియాకు రణ్​బీర్​ కాస్ట్లీ గిఫ్ట్​.. దాని ప్రత్యేకత ఏంటంటే?

author img

By

Published : Apr 14, 2022, 11:11 AM IST

Updated : Apr 14, 2022, 11:41 AM IST

Ranbirkapoor Diamond gift to Aliabhatt: హీరో రణ్​బీర్​ కపూర్​ తనకు కాబోయే భార్య హీరోయిన్​ ఆలియా భట్​కు ఖరీదైన కానుక ఇచ్చారని తెలిసింది. ఆమెకు ప్రత్యేకంగా 8 వజ్రాలు పొదిగిన ఓ కాస్ట్లీ బ్యాండ్​ను బహూకరించారటా!

Ranbirkapoor Diamond gift to Aliabhatt
ranbir alia marriage

Ranbirkapoor Diamond gift to Aliabhatt: బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ రణ్​బీర్​ కపూర్​, ఆలియా భట్​ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబయిలోని రణ్​బీర్​ నివాసం 'వాస్తు'లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. రణ్​బీర్​ తనకు కాబోయే భార్యకు అత్యంత ఖరీదైన కానుక ఇచ్చారని తెలిసింది. ఈ ముద్దుగుమ్మ కోసం ప్రత్యేకంగా 8 వజ్రాలు పొదిగిన కాస్ట్లీ బ్యాండ్​ను తయారు చేయించి ఇచ్చారట. లండన్​ నుంచి దీన్ని తెప్పించారని తెలుస్తోంది. ఈ వజ్రాల బ్యాండ్​ను ఆమె పెళ్లిలో ధరించనుంది.

ఇందులో ప్రత్యేకమేమిటంటే 8 సంఖ్య. ఆ సంఖ్య కపూర్​ కుటుంబానికి లక్కీ నంబర్​ అంట. మరోవైపు ఆలియాకు కూడా ఎనిమిది సంఖ్య లక్కీ నంబరు అని తెలిసింది. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వజ్రాలు పొదిగిన బ్యాండ్​ను రణ్​బీర్​ బహూకరించారని అంతా మాట్లాడుకుంటున్నారు. ఘనంగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ, వరుణ్​ ధావన్​, అయాన్​ ముఖర్జీ, జోయా అక్తర్​, అర్జున్​ కపూర్​, మసాబా గుప్తా, కరణ్​ జోహార్​, కరీష్మా కపూర్​, కరీనా కపూర్​, సైఫ్​ అలీఖాన్​ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఇదీ చూడండి: ఆలియా- రణ్​బీర్​ వెడ్డింగ్ వైబ్స్.. సెలబ్రిటీల సందడి!

Last Updated : Apr 14, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.