MR.Pregnant Collections : బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ యంగ్ హీరో సోహైల్ నటించిన కొత్త ప్రయోగాత్మక చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. రీసెంట్గా ఈ చిత్రం ఆగస్టు 18వ తేదీన విడుదలై పర్వాలేదనిపించే టాక్‌ను తెచ్చుకుంది. అయితే ఇప్పుడీ చిత్రానికి రెస్పాన్స్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ ఆరంభంలో స్క్రీన్స్ తక్కువే దొరికినప్పటికీ.. మంచి రెస్సాన్స్ రావడంతో స్క్రీన్ కౌంట్ పెంచుతున్నారని సమాచారం అందింది.
గత మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వినపడుతోంది. మొదటి మూడు రోజుల్లో యావరేజ్‌గా మార్నింగ్ షోకు 25 శాతం, మ్యాట్నీకి 35 శాతం, ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని తెలిసింది. సోమవారం కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Mr Pregnant Collection Till Now : కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే.. మొదటి రోజు రూ.35 లక్షలు నమోదు చేసిందని తెలిసింది. రెండో రోజు రూ. 40 లక్షలు కలెక్ట్ చేయగా.. మూడో రోజు రూ.45 లక్షల రూపాయలను అందుకుందని సమాచారం అందింది. అంటే తొలి రోజుతో పోలిస్తే.. రెండో, మూడో రోజు ఎక్కువ వసూళ్లను సాధించడం విశేషం. ఇక నాలుగో రోజు సోమవారం నాన్ వీకెండ్లో రూ. 20 లక్షల రూపాయలతో సరిపెట్టుకుంది. దీంతో ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1.4 కోట్లను వసూలు చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Mr Pregnant Cast and Crew : ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్ట్ చేశారు. రూప హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, బ్రహ్మాజీ, రజా రవీంద్ర, అలీ, అభిషేక్ రెడ్డి, వైవా హర్ష, స్వప్నిక తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వ్యవహరించారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందించారు.
Mister Pregnant Movie Review : కొత్త కాన్సెప్ట్‌తో 'మిస్టర్ ప్రెగ్నెంట్'.. సినిమా ఎలా ఉందంటే?