ETV Bharat / crime

అబలలపై దారుణాలు.. ఒకేరోజు మూడు చోట్ల లైంగిక దాడులు - AP news

కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. మంగళవారం ఏపీలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు మానసిక దివ్యాంగులపై అఘాయిత్యాలు జరిగాయి. అనంతలో బాలికపై యాసిడ్‌ దాడి జరిగింది.

three-rape-cases-at-andhra-pradesh in one day
అబలలపై ఆగని దారుణాలు.. ఒకేరోజు మూడు చోట్ల లైంగిక దాడులు
author img

By

Published : Mar 24, 2021, 10:56 PM IST

ఏపీలో మంగళవారం మూడు వేర్వేరు చోట్ల దారుణాలు వెలుగుచూశాయి. అమాయకులపై కామాంధులు అకృత్యాలకు తెగబడ్డారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో మానసిక, శారీరక పరిణతి లేని యువతులపై లైంగిక దాడులు జరగ్గా.. అనంతలో ఓ బాలికపై యాసిడ్‌ పోసి పైశాచికాన్ని ప్రదర్శించాడో దుండగుడు.

బధిర యువతిపై:

ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌ పరిధిలో అవివాహిత బధిర యువతి(30) మానసిక వైకల్యంతో బాధపడుతోంది. స్థానికుడైన నాగినేని నారాయణ(42) ఈనెల 20న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని బాధితురాలు సైగలతో కుటుంబసభ్యులకు వివరించింది. వారి ఫిర్యాదు మేరకు దిశ పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దిశ పీఎస్‌ సీఐ సత్యకైలాశ్‌నాథ్‌ తెలిపారు.

మానసిక వికలాంగురాలిపై:
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని ఓ కాలనీకి చెందిన మానసిక దివ్యాంగురాలు(21) ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. మంగళవారం ఇంట్లోకి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంతలో యువతి తల్లి వచ్చి చూసి కేకలు వేయడంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, గ్రామీణ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై ముత్యాలరావు ఘటనాస్థలికి చేరుకుని విచారించారు. యువతిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. కేసును దిశా పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు.

బాలికపై యాసిడ్ దాడి:
అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివే బాలికపై మాస్కును ధరించిన దుండగుడు ఉదయం యాసిడ్‌తో దాడిచేసి పరారయ్యాడు. యువకుడి దుశ్చర్యతో అప్రమత్తమైన బాలిక.. ముఖంపై చేయి అడ్డుపెట్టుకొంది. బాలిక కుడిచేతిపై యాసిడ్‌ పడి కందిపోయింది. ఆగంతుకుడు అక్కడి నుంచి పారిపోగా విద్యార్థినిని ఉపాధ్యాయులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భవాని బాధితురాలిని పరామర్శించారు. డీఎస్పీ షర్ఫుద్దీన్‌, వన్‌టౌన్‌ సీఐ నాగశేఖర్‌ బాలిక నుంచి ఫిర్యాదును స్వీకరించారు. అనుమానితులను విచారిస్తున్నారు. దుండగుడు కళాశాల ల్యాబ్‌లో ఉండే తక్కువ గాఢత గల రసాయన ద్రావణం పోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆస్తి పన్ను చెల్లించేందుకు వారం మాత్రమే మిగిలుంది: జీహెచ్ఎంసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.