ETV Bharat / crime

అధిక ధరలకు విక్రయిస్తున్న విత్తనాలను సీజ్​ చేసిన టాస్క్​ఫోర్స్​

పెద్దపల్లి జిల్లాలో ఎలాంటి బిల్లులు లేకుండా అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 48 పత్తి విత్తనాల ప్యాకెట్​లను స్వాధీనం చేసుకున్నారు.

Peddapalli district police seized fake seeds
బ్లాక్​లో విత్తనాలను పట్టుకున్న రామగుండం పోలీసులు
author img

By

Published : Jun 18, 2021, 5:32 PM IST

పెద్దపల్లి జిలా మంథని మండలంలోని ఉప్పతట్ల గ్రామంలో ఎలాంటి బిల్లులు లేకుండా అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తున్న కేశెట్టి రవి అనే వ్యక్తిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రెండు కంపెనీలకు చెందిన 48 పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

జిల్లాలోని ఉప్పట్ల గ్రామానికి చెందిన కేశెట్టి రవి అనే వ్యక్తి బ్లాక్​లో విత్తనాలను విక్రయిస్తున్నాడన్న సమాచారంతో టాస్క్​ఫోర్స్​ పోలీసులు మంథని పోలీసులతో కలిసి అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రెండు కంపెనీలకు చెందిన 48 పత్తి విత్తనాల ప్యాకెట్​లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మంథని పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి: Theft arrest: నిఘా నేత్రాల సాయంతో గొలుసు దొంగను పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.