న్యూడ్ ఫొటోలతో యువతిని వేధిస్తోన్న.. ఓ నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యాప్లో పరిచయమైన ఆ వ్యక్తి.. స్నేహం ముసుగులో బాధితురాలితో మాట కలిపాడు. అలా ఆ వ్యవహారం.. న్యూడ్ ఫొటోలతో ఛాటింగ్ చేసే వరకూ వెళ్లింది. విసిగిపోయిన ఆ యువతి.. జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఐపీ అడ్రస్ ఆధారంగా.. నిందితుడు ముంబయికు చెందిన అమీర్ అహ్మద్ఖాన్గా గుర్తించారు. లొకేషన్ ఆధారంగా అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: తరగతి గదిలో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య