Murder Attempt on TDP Leader : కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషంలో వచ్చిన దుండగుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ ఘటనలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కాకినాడలో అపోలో ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడు బైక్‌పై పరారయ్యాడు.
సమాచారం అందుకున్న తుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టీడీపీ సీనియర్ నేతలు యనమల, చినరాజప్ప తదితరులు ఆస్పత్రికి వెళ్లారు. శేషగిరిరావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.