ETV Bharat / crime

Illegal Gas Refilling: ఇంట్లో పేలుడు.. గ్యాస్‌ రీఫిల్ చేస్తుండగా చెలరేగిన మంటలు

Illegal Gas Refilling: అక్రమంగా గ్యాస్ రీఫిల్​ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్​లోని దుండిగల్​లో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Illegal Gas Refilling
గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం
author img

By

Published : Dec 9, 2021, 12:15 PM IST

Illegal Gas Refilling: అక్రమంగా గ్యాస్ రీఫిల్ చేయడమే తప్పు. అలాంటిది ఓ వ్యక్తి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇంట్లోనే గ్యాస్​ సిలిండర్ రీఫిల్లింగ్ చేసే పనికి పూనుకున్నాడు. రోజూలాగానే గ్యాస్​ రీఫిల్లింగ్ చేస్తుండగా.. మంటలు చెలరేగి గాయాలపాలయ్యాడు. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పీఎస్​ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

దుండిగల్​లోని గండి మైసమ్మ ఆలయ సమీపంలో నివాసముంటున్న ఫిరోజ్ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండేవాడు. ఈరోజు కూడా పెద్ద సిలిండర్​ నుంచి చిన్న సిలిండర్​లోకి గ్యాస్ నింపుతుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కుటుంబసభ్యులు మంటలను ఆర్పేశారు. గాయపడిన ఫిరోజ్​ను అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ధన, ప్రాణ నష్టం జరగలేదు. ఇలా అక్రమంగా, అనుమతులు లేకుండా గ్యాస్​ రీఫిల్​ చేయకూడదని పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి: ఆర్మీ హెలికాప్టర్ క్రాష్​కి ఒక్క నిమిషం ముందు వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.