చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభించిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. జేబుల్లో వెతకగా ఒక కార్డు దొరకడంతో దానిపై ఉన్న నంబర్‌కి ఫోన్ చేయగా అతని పేరు హాజీగా తెలిసింది.
పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తు పడిపోయాడా లేదా వేరే కారణం ఏమైన ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: సింగరేణి కార్మికులకు ఉచితంగా కరోనా టీకా