ETV Bharat / crime

నీ ఇన్​స్టా ఫొటో మార్ఫింగ్ చేశా.. డబ్బివ్వకపోతే వైరల్ చేస్తా!

ఇన్​స్టాగ్రామ్ వేదికగా కొందరు కేటుగాళ్లు అమాయక అమ్మాయులు, విద్యార్థినులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారు ఇన్​స్టాలో పోస్టు చేసిన చిత్రాలను మార్ఫింగ్ చేసి బ్లాక్​మెయిల్ చేస్తున్నారు. తాము అడిగిన సొమ్ము ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఆ ఫొటోలను వైరల్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. మెట్రో నగరాల్లో రోజుకు వందల్లో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి.

Cybercrime, threats to young women, threats in the name of morphing
సైబర్ క్రైమ్, యువతులకు బెదిరింపులు, మార్ఫింగ్ పేరుతో బెదిరింపులు
author img

By

Published : Jun 24, 2021, 7:20 AM IST

  • మీ చిత్రాలను ఇన్‌స్టాలో సేకరించా... వాటిని నగ్నంగా మార్ఫింగ్‌ చేశాను. ఇంతేకాదు మీ ముఖచిత్రాలతో వీడియోలనూ రూపొందించా. వీటిని మీ స్నేహితులు.. సన్నిహితులకు పంపేందుకు సిద్ధం చేశా. యూట్యూబ్‌లోనూ పోస్ట్‌ చేయబోతున్నా. 24గంటల్లో రూ.1.50లక్షలు నేను పంపించిన బ్యాంక్‌ ఖాతాలో పంపు.. లేదంటే మీ స్నేహితులకు వెళ్తాయ్‌. ’’ ఎస్సార్‌నగర్‌లో ఉంటున్న యువతితో సైబర్‌ కేటుగాడు అన్నమాటలవి. ముందుగా భయపడ్డా తర్వాత స్నేహితురాలి సాయంతో ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆంజనేయులును రెండురోజుల క్రితం అరెస్ట్‌చేసి జైలుకు పంపారు.
  • కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ప్రైవేటు ఉద్యోగి మహ్మద్‌ ఇలా యాభైమందికిపైగా మోసం చేశాడు. ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని కొద్దినెలల క్రితం అరెస్ట్‌చేశారు. పదికిపైగా కేసులు అతడిపై నమోదయ్యాయి.

ఇలాంటి ఘటనలు అన్ని ప్రాంతాల్లోని వారికి ఎదురవుతున్నాయి. బెదిరింపులు, హెచ్చరికలకు భయపడి 90శాతం బాధితులు నేరస్థులు అడిగిన సొమ్మును ఇచ్చేస్తున్నారు. బాధితులు ఇచ్చిన డబ్బుతో సంతృప్తి చెందకుండా మళ్లీమళ్లీ డబ్బు కోసం నిందితులు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.

నమోదైన కేసులు

అక్కడ సేకరించి..

సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మెట్రో నగరాల్లో సైబర్‌ నేరాలు రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. విద్యార్థినులు, యువతులు ఇన్‌స్టాగ్రామ్‌లో తమ చిత్రాలను వేర్వేరు భంగిమల్లో పోస్ట్‌ చేస్తున్నారు. అదే వారి పాలిట శాపంగా మారుతోంది. వీటిని సేకరించి నగ్నచిత్రాలు, వీడియోలుగా వాటిని మార్చి బాధితులకు పంపించి రూ.లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలుస్తుందన్న భయం, పరువుపోతుందని చాలామంది అడిగిన సొమ్మును ఇచ్చేస్తున్నారు. మరికొందరు నిందితులు తమ లైంగిక కోర్కెలు తీర్చాలాంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. బెంగళూరులోని ఒక ప్రముఖ కళాశాలకు చెందిన విద్యార్థినులు, అధ్యాపకుల చిత్రాలను కొందరు అసభ్యంగా మార్చి యూట్యూబ్‌లో వీడియోలుగా కొద్దినెలల క్రితం ఉంచారు. దిల్లీలో ‘బాయ్స్‌ లాకర్‌ రూమ్‌’పేరుతో కొనసాగిన అశ్లీలం, అసభ్యం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగానే కొనసాగింది.

భయపడొద్దు... మీ ఐచ్ఛికాలు మార్చుకోండి

నగ్నచిత్రాలు, వీడియోలు ఉంచుతాం అంటూ ఎవరైనా బెదిరిస్తే భయపడొద్ధు. వెంటనే సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయండి.. మీకు వచ్చిన బెదిరింపులు, చిత్రాల వివరాలను 94906 16555 నంబర్‌కు వెంటనే వాట్సప్‌ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తిగత చిత్రాలను ఉంచకూడదు. ఎవరైనా సరే వాటిని సంగ్రహించి ఎలాగైనా మార్చుకునే వీలుంది. అందుకే ఖాతాలో మీ ఐచ్ఛికాలు మార్చుకోండి అపరిచితులు, సైబర్‌ నేరస్థులు మీ వివరాలు, చిత్రాలను చూసేందుకు అవకాశముండదు.

కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ సైబర్‌ క్రైమ్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.